logo

మురుగన్‌ సేవలో ప్రేమలత

డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ తిరుత్తణి ఆర్ముగ స్వామిని దర్శించుకున్నారు. తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణి కొండపై మురుగన్‌ ఆలయంలో శుక్రవారం జరిగిన బంధువు ఎల్‌కే రఘు-రాహుల్‌ ఇంటి వివాహ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

Published : 28 Jan 2023 01:05 IST

ఆలయ ప్రాంగణంలో ప్రేమలత తదితరులు

తిరుత్తణి, న్యూస్‌టుడే: డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌ తిరుత్తణి ఆర్ముగ స్వామిని దర్శించుకున్నారు. తిరువళ్ళూరు జిల్లా తిరుత్తణి కొండపై మురుగన్‌ ఆలయంలో శుక్రవారం జరిగిన బంధువు ఎల్‌కే రఘు-రాహుల్‌ ఇంటి వివాహ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఆర్ముగస్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో ప్రసాదాలు అందించారు. రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి ఎల్‌కే.సతీష్‌, జిల్లా డీఎండీకే  కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు ఆమెను ఘనంగా స్వాగతించారు. రానున్న లోక్‌ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై నిర్వాహకులకు సూచనలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని