logo

ఉచిత నేత్ర వైద్య శిబిరాలతో లబ్ధి పొందాలి

రోటరీ సంఘం తరఫున నిర్వహిస్తున్న ఉచిత నేత్ర చికిత్స శిబిరాలను ప్రజలు ఉపయోగించుకొని లబ్ధిపొందాలని కాంచీపురం ఎమ్మెల్యే సీవీఎంపీ ఎళిలరసన్‌ పేర్కొన్నారు.

Published : 28 Jan 2023 01:05 IST

శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎళిలరసన్‌

కాంచీపురం, న్యూస్‌టుడే: రోటరీ సంఘం తరఫున నిర్వహిస్తున్న ఉచిత నేత్ర చికిత్స శిబిరాలను ప్రజలు ఉపయోగించుకొని లబ్ధిపొందాలని కాంచీపురం ఎమ్మెల్యే సీవీఎంపీ ఎళిలరసన్‌ పేర్కొన్నారు. కాంచీపురం సమీపం ఓరిగైలో ఉన్న భారతీదాసన్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాల ప్రాంగణంలో రోటరీక్లబ్‌ ఆఫ్‌ కాంచీపురం, గ్రాండ్‌ యంగ్‌ ఇండియన్స్‌ ఆర్గనైజేషన్‌, శంకర నేత్రాలయ సంయుక్తంగా 100వ  శిబిరాన్ని వారం రోజుల పాటు నిర్వహించనున్నాయి. రోటరీ సంఘం గవర్నరుగా ఎంపికైన భరణిధరన్‌ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ చికిత్సలను ఉపయోగించుకొని ప్రజలు లబ్ధిపొందటంతోపాటు ఇతరులకు వీటి గురించి తెలపాలన్నారు. కార్యక్రమంలో రోటరీ సంఘం జిల్లా కార్యదర్శి జి.మురుగేష్‌, భారతీదాసన్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాల సీఈఓ వినాయకమూర్తి,  డైరెక్టరు కృష్ణకుమార్‌, యంగ్‌ ఇండియన్స్‌ ఛైర్మన్‌ ప్రసన్న, వైస్‌ ఛైర్మన్‌ రాజరాజన్‌, శంకర నేత్రాలయ వైద్యులు శంకర్‌, గౌరవ్‌, సమన్వయకర్త అరుల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కాంచీపురం గ్రాండ్‌ సంఘ అధ్యక్షుడు కె.అరుణ్‌కుమార్‌, కార్యదర్శి కె.యు. సతీష్‌ కుమార్‌ తదితరులు పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని