logo

నల్లకన్నుకు మంత్రి పరామర్శ

శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని మంత్రి మా.సుబ్రమణియన్‌ వద్ద నల్లకన్ను కోరారు.

Published : 29 Jan 2023 01:32 IST

నల్లకన్నుతో మాట్లాడుతున్న సుబ్రమణియన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని మంత్రి మా.సుబ్రమణియన్‌ వద్ద నల్లకన్ను కోరారు. సీపీఐ సీనియర్‌ నేత నల్లకన్ను అనారోగ్యం కారణంగా చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ శనివారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అప్పుడు శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్యులు, నర్సులు లేరని, అందువలన వైద్యులు, నర్సులను నియమించాలని మంత్రిని నల్లకన్ను కోరారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి భార్య తల్లి కన్యాకుమారికి యాత్ర కోసం వచ్చినప్పుడు అనారోగ్యంతో చెన్నై రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆమెను మంత్రి పరామర్శించారు. రెండ్రోజుల్లో కోలుకుంటారని మంత్రి మా.సుబ్రమణియన్‌ ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. సీర్గాళికి చెందిన బాలిక అభినయ అరుదైన జన్యు వ్యాధి కారణంగా రెండు కాళ్లు దెబ్బతిని చికిత్స పొందుతుంది. బాలికను మంత్రి పరామర్శించి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ...కాళ్లను కోల్పోకుండా మరలా నడవగలుగుతున్నట్లు బాలిక ఆనందం వ్యక్తం చేసిందన్నారు. నెల తర్వాత రూ.లక్ష విలువైన పాదరక్షలు వేసుకోనుందని చెప్పారు. శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్య సిబ్బంది లేరని, అక్కడ వైద్యులు, నర్సులను నియమించాలని నల్లకన్ను కోరారన్నారు. ఇప్పటికే వైద్యుల నియామకం చేసినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని