logo

ఆర్థిక రంగంలో బలపడాలి: మంత్రి

ఆర్థిక రంగ కార్యకలాపాల్లో రాష్ట్రం తొలిస్థానంలో ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తెలిపారు.

Published : 01 Feb 2023 00:32 IST

మాట్లాడుతున్న పళనివేల్‌ త్యాగరాజన్‌

సైదాపేట, న్యూస్‌టుడే: ఆర్థిక రంగ కార్యకలాపాల్లో రాష్ట్రం తొలిస్థానంలో ఉండాలని ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తెలిపారు. తమిళనాడు ఆడిట్‌ కార్యాలయం తరఫున సహాయ ఆడిట్‌ ఇన్‌స్పెక్టర్లకు 5 రోజుల కోర్సు అన్నా వర్సిటీలో జరుగుతోంది. అధికారుల పనితీరు పెంచేందుకు చెన్నై మండల శిక్షణ సంస్థ తరగతులు నిర్వహిస్తోంది. శిక్షణను పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిగా ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో అన్నా వర్సిటీతో కలిసి శాశ్వత తరగతులు నిర్వహించటం గురించి అధ్యయం చేస్తున్నామన్నారు. ఆర్థిక రంగ కార్యకలాపాల్లో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తమిళనాడు ఉండాలన్నారు. దీనికి అధికారులు సహకరించాలని కోరారు.  
రాష్ట్రాభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించటమే ప్రస్తుతం తమ పనని ఆర్థిక శాఖ మంత్రి పళనివేలు త్యాగరాజన్‌ తెలిపారు. ఒక ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా తమిళనాడు పేరిట అసోచాం తరఫున మంగళవారం ఏర్పాటైన సదస్సును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సాధారణ స్థితికి వస్తోందని తెలిపారు. గతేడాది బడ్జెట్ తర్వాత రాష్ట్ర అభివృద్ధి బాగుందన్నారు. నాన్‌ ముదల్వర్‌ తదితర పథకాలు దాని కొనసాగింపుగా ప్రారంభించినవేనని పేర్కొన్నారు. 2011-22లో రాష్ట్ర జీడీపీˆ చాలా తగ్గిందన్నారు. అన్నాడీఎంకే పాలన, రాజకీయాలకు అతీతమైనవి కారణమని తెలిపారు. గతేడాది బడ్జెట్లో చాలా అంచనాలు ఉన్నాయని, ఈ సారి అలా ఉండవన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషించటమే ప్రస్తుతం మన ముందు ఉన్న పనని పేర్కొన్నారు. ఇలాంటి సదస్సులు దానికి దోహదపడతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని