logo

ఐఐటీఎంలో జీ20 విద్యాసదస్సు ప్రారంభం

విద్యా రంగానికి సంబంధించి ‘జీ20’ సదస్సు (ఎడ్‌డబ్ల్యూజీ) ఐఐటీఎం రీసెర్చి పార్కులో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కె.సంజయ్‌ మూర్తి అన్నారు. ‘

Published : 01 Feb 2023 00:32 IST

సదస్సుకు హాజరవుతున్న ప్రతినిధులు.. కార్యక్రమంలో అనిల్‌ సహస్రబుద్ధే, వి.కామకోటి, సంజయ్‌ కుమార్‌, సంజయ్‌ మూర్తి..  ప్రదర్శనను తిలకిస్తున్న సౌదీ ప్రతినిధులు

వడపళని, న్యూస్‌టుడే: విద్యా రంగానికి సంబంధించి ‘జీ20’ సదస్సు (ఎడ్‌డబ్ల్యూజీ) ఐఐటీఎం రీసెర్చి పార్కులో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కె.సంజయ్‌ మూర్తి అన్నారు. ‘విద్యారంగంలో డిజిటల్‌ సాంకేతికతల ప్రాధాన్యత’పై తొలిసారిగా మూడు రోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఇందులో సంజయ్‌ మూర్తి మాట్లాడుతూ.. 20 దేశాలు డిజిటల్‌ సాంకేతికతను వినియోగించుకుంటూ అభివృద్ధి సాధించాయన్నారు. పలు అంతర్జాతీయ, విద్యాసంస్థల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఐఐటీ డైరెక్టర్‌ వి.కామకోటి ఆహూతులకు స్వాగతం పలికారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై  చర్చలు ఉంటాయని చెప్పారు. సదస్సు ద్వారా ప్రపంచంలోని ప్రతి విద్యార్థి కనీసం గ్రాడ్యుయేట్‌ అయి ఉండాలన్నదే లక్ష్యమని కామకోటి పేర్కొన్నారు. మన దేశంలో ఏడాదికి  85 లక్షల కంటే ఎక్కువ మంది యూజీ కోర్సులు అభ్యసిస్తున్నారని ఆచార్యులు ఆండ్రూ తంగరాజ్‌ అన్నారు. ‘నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరం’ (ఎన్‌ఈటీఎఫ్‌) ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే, కేంద్ర నైపుణ్య విభాగ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ తివారి తదితరులు పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శన పలువురిని అమితంగా ఆకట్టుకున్నాయి. సౌదీ నుంచి విచ్చేసిన ప్రతినిధులు స్టాళ్లను సందర్శించారు. డ్రోన్‌ వినియోగం, రోబో ద్వారా వెన్నెముకకు శస్త్రచికిత్స చేసే తీరును పరిశోధకులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని