logo

కృష్ణస్వామి అనంతరామన్‌కు విశిష్ట పురస్కారం

చెన్నైకి చెందిన ఎయిర్‌ మార్షల్‌ కృష్ణస్వామి అనంతరామన్‌ వీఎస్‌ఎం ‘పరమ్‌ విశిష్ట్‌ సేవా మెడల్‌’ అందుకోనున్నారు.

Published : 01 Feb 2023 00:40 IST

వడపళని, న్యూస్‌టుడే: చెన్నైకి చెందిన ఎయిర్‌ మార్షల్‌ కృష్ణస్వామి అనంతరామన్‌ వీఎస్‌ఎం ‘పరమ్‌ విశిష్ట్‌ సేవా మెడల్‌’ అందుకోనున్నారు. ఈయన ప్రస్తుతం న్యూదిల్లీలోని ఎయిర్‌ హెడ్‌క్వార్టర్సులో ఎయిర్‌ ఆఫీసర్‌ ఇన్‌ఛార్జి అడ్మినిస్ట్రేషన్‌గా పని చేస్తున్నారు. 1985 జూన్‌ 14న భారత వైమానిక దళంలో చేరారు. 37 ఏళ్లుగా వివిధ విభాగాల్లో సేవలందించినట్లు రక్షణ శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని తాంబరం కృష్ణస్వామి అనంతరామన్‌ స్వస్థలం. 1983లో ఏఎం జైన్‌ కళాశాలలో బీఏ కార్పొరేట్‌ సెక్రటరీషిప్‌లో పట్టా పొందారు. ఎమ్మెస్సీ డిఫెన్స్‌ స్టడీస్‌, మద్రాస్‌ వర్సిటీ అనుబంధ కళాశాల ‘నేషనల్‌ డిఫెన్స్‌ కళాశాల’లో ఎంఫిల్‌తో పాటు జోధ్‌పూర్‌లోని జై నారాయణ్‌ వ్యాస్‌ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివారు. ఇటీవల జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో భాగంగా కృష్ణస్వామికి సాయుధ బలగాల విభాగంలో అందించిన సేవలకు గుర్తుగా ‘పరమ్‌ విశిష్ట్‌ సేవా మెడల్‌’ను రాష్ట్రపతి ప్రకటించారు. త్వరలోనే అందుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని