logo

కావళ్ల ఊరేగింపు

ఏటా తైపూస పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ వాసులు ఒకచోట చేరి కావళ్లను పళని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.

Updated : 01 Feb 2023 06:03 IST

తరలివస్తున్న భక్తులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఏటా తైపూస పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ వాసులు ఒకచోట చేరి కావళ్లను పళని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ. ఆమేరకు ఈ ఏడాది కందనూర్‌, అరణ్మనై పొంగల్‌, నెర్కుప్పై తదితర ప్రాంతాల నుంచి కావళ్లతో బయలుదేరిన భక్తులు కుండ్రక్కుడిని కేంద్రంగా పళని వైపు బయలుదేరాయి. పిళ్ళైయార్‌పట్టిలో దర్శనం చేసుకుని పాదయాత్రగా తిరుప్పత్తూర్‌ రోడ్డు మార్గంలో సింగంపురి వైపు బయలుదేరారు. సోమవారం ఉదయం సింగంపురి సేవుగపెరుమాల్‌ అయ్యనార్‌ కోవిల్‌కి చేరకుని అక్కడ నుంచి దిండిగల్లు మార్గంగా పాదయాత్ర కొనసాగనుంది. సింగంపురి నాలుగు రోడ్ల కూడలిలో భక్తులు కావళ్లకు ఘన స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని