logo

నామపత్రాల దాఖలుకు ప్రధాన పార్టీల సన్నాహాలు

ఈనెల 27న ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. డీఎంకే కూటమి తరపున కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, ఓపీఎస్‌ వర్గం, డీఎండీకే, ఏఎంఎంకే, నామ్‌ తమిళర్‌ కట్చి వంటి ముఖ్యమైన పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించారు.

Published : 03 Feb 2023 01:53 IST

నామినేషన్‌ వేస్తున్న మేనకా నవనీతన్‌

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈనెల 27న ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీకి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. డీఎంకే కూటమి తరపున కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, ఓపీఎస్‌ వర్గం, డీఎండీకే, ఏఎంఎంకే, నామ్‌ తమిళర్‌ కట్చి వంటి ముఖ్యమైన పార్టీల తరపున అభ్యర్థులను ప్రకటించారు. గతనెల 31 నామినేషన్ల దాఖలు ప్రారంభం కాగా మొదటి రోజు 10 మందికి పైగా స్వతంత్ర అభ్యర్ధులు వినూత్న రీతిలో నామ పత్రాలు దాఖలు చేశారు. ఇందులో 6 నామపత్రాలు సక్రమంగా లేకపోవడంతో అధికారులు తిరష్కరించారు. రెండు రోజుల్లో మొత్తం 10 నామపత్రాలు ఆమోదించారు. గురువారం నామ్‌ తమిళర్‌ పార్టీ కట్చి అభ్యర్ధి మేనకా నవనీతన్‌ నామ పత్రం దాఖలు చేశారు. శుక్రవారం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, ఏఎంఎంకే  అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ముందస్తు చర్యలుగా ఈరోడ్‌ టౌన్‌ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా పనులు చేపడుతున్నారు. ఒకేరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు నామ పత్రాలు దాఖలు చేస్తున్నందున అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నామ పత్రాలు దాఖలు చేయడానికి ఆఖరి రోజుగా నిర్ణయించారు. 8వ తేదీ పరిశీలిన, 10వ తేదీ ఉపసంహరణ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని