logo

కలిసి పనిచేయాలనేదే ప్రజల ఆకాంక్ష

భాజపా- అన్నాడీఎంకేలు కలిసి పని చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నారు.

Updated : 03 Feb 2023 05:33 IST

పన్నీర్‌సెల్వం

విలేకరులతో మాట్లాడుతున్న ఓపీఎస్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: భాజపా- అన్నాడీఎంకేలు కలిసి పని చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మదురై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ...కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్్  అన్ని రంగాలను ప్రగతిపథంలోకి తీసుకెళ్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర పథకాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. అన్నాడీఎంకే నిబంధనల ప్రకారం పార్టీ పరంగా ఎన్నికల్లో సమన్వయకర్తగా తనకు, ఉపసమన్వయకర్తగా పళనిస్వామి పదవి 2026 వరకు ఉంటాయన్నారు. త్వరలో శశికళను కచ్చితంగా కలుస్తానన్నారు. అభ్యర్థి ప్రకటన తర్వాత భాజపా నుంచి పిలుపు వస్తే అధికారకంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. భాజపా, అన్నాడీఎంకేలు కలిసి పనిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గంలో తమకు విజయం వరించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని