logo

‘పన్ను చెల్లించకుంటే కఠిన చర్యలు’

తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, వ్యాపారులు పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలను గడువు తేదీలోగా చెల్లించకుంటే దుకాణాలు, ఇళ్లు జప్తు చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ రామజయం హెచ్చరించారు

Published : 03 Feb 2023 01:53 IST

ఓ దుకాణ గోడకు నోటీసు అంటించిన దృశ్యం

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరుత్తణి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, వ్యాపారులు పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిలను గడువు తేదీలోగా చెల్లించకుంటే దుకాణాలు, ఇళ్లు జప్తు చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ రామజయం హెచ్చరించారు. 21 వార్డుల్లో 13,500 గృహాలు, 114 వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. వాటి నుంచి అందాల్సిన తాగునీరు, ఆస్తి ఇతరత్రా పన్నులను సకాలంలో చెల్లించకపోవడంతో మున్సిపల్‌ అధికారులు పలు ఇళ్లకు తాగునీటి సరఫరా నిలిపేశారు. జప్తు నోటీసులు జారీ చేశారు. దీని గురించి కమిషనర్‌ రామజయం గురువారం విలేకరులతో మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలన్నారు. ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు రూ.3.10 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేదన్నారు. పన్నులు చెల్లించని గృహాలు, వర్తక సంస్థలకు నోటీసులు పంపించే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. గత అయిదు రోజులలో పది ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు తొలగించామని పేర్కొన్నారు. 600 దుకాణాలు, కల్యాణ మండపాల గోడలకు అంటించామన్నారు. ప్రజలు గడువు తేదీలోగా ముందుకొచ్చి పన్నులు చెల్లించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని