logo

‘విద్యతో బంగారు భవిత’

విద్యార్థుల బంగారు భవితకు విద్య పునాది లాంటిదని డీసీపీ పవన్‌కుమార్‌ రెడ్డి హితవుపలికారు.

Published : 04 Feb 2023 00:38 IST

వేడుకను ప్రారంభిస్తున్న పాలకమండలి సభ్యులు, ప్రిన్సిపల్‌, మేనేజరు

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: విద్యార్థుల బంగారు భవితకు విద్య పునాది లాంటిదని డీసీపీ పవన్‌కుమార్‌ రెడ్డి హితవుపలికారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ధర్మ సంస్థ నిర్వహణలోని మహర్షి విద్యా మందిర్‌ ఎనిమిదవ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. అత్యవసర పని నిమిత్తం రాలేకపోయిన పవన్‌కుమార్‌ రెడ్డి సందేశాన్ని పంపించారు. పాలక మండలి సభ్యులు ఊరా ఆంజనేయులు, నాళం శ్రీకాంత్‌, డాక్టర్‌ విజయ్‌ కుమార్‌, ఊటుకూరు శరత్‌కుమార్‌లు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. పాఠశాల కరస్పాడెంట్‌ దేసు లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. విద్యా మందిర్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వినోల మురళి తమ వార్షిక నివేదికలో ఏడాది పొడవున నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ ఏడాది ప్లస్‌టూ తరగతులు ప్రవేశపెట్టామని తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలతో పాటు పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారికి పాలక మండలి సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన బృంద నృత్యాలు ప్రేక్షకులకు కనువిందు కలిగించాయి. మేనేజరు శ్రీలత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని