logo

సినిమా పోకడనే మార్చిన కళాతపస్వి

తెలుగు సినిమా పోకడను మార్చి హిమాలయాల స్థాయికి చేర్చిన మహనీయుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ అని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి కొనియాడారు.

Published : 04 Feb 2023 00:38 IST

సీఎంకే రెడ్డి

అప్పటి గవర్నర్‌ పీఎస్‌ రామమోహనరావు సమక్షంలో విశ్వనాథ్‌ను సన్మానిస్తున్న దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తెలుగు సినిమా పోకడను మార్చి హిమాలయాల స్థాయికి చేర్చిన మహనీయుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ అని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి కొనియాడారు. ప్రముఖ దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్‌ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సౌండ్‌ ఆర్టిస్ట్‌గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన విశ్వనాథ్‌ ఆదుర్తి సుబ్బారావు వద్ద దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నట్లు గుర్తు చేశారు. 1965లో తొలిసారిగా ‘ఆత్మగౌరవం’ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందారని, 50 కళాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత పొందారని పేర్కొన్నారు. రికార్డును తిరగరాసిన ‘శంకరాభరణం’ విడుదలైన (1980 ఫిబ్రవరి 2) రోజు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌ఆర్‌ కళాపీఠం తరఫున అప్పటి గవర్నర్‌ పీఎస్‌ రామమోహనరావు సమక్షంలో విశ్వనాథ్‌ను ఘనంగా సన్మానించినట్లు ఆయన వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని