logo

మహిళలపై అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక చర్యలు

మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు అవగాహన అవసరమని, తాము తగిన చర్యలు  తీసుకుంటున్నట్లు చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ అన్నారు.

Published : 05 Feb 2023 00:58 IST

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న శంకర్‌ జివాల్‌

సైదాపేట, న్యూస్‌టుడే: మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు అవగాహన అవసరమని, తాము తగిన చర్యలు  తీసుకుంటున్నట్లు చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ అన్నారు.  మహిళలపై నేరాలు, సంబంధిత చట్టాలపై అడయారులోని ఓ ప్రైవేటు కళాశాలలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో కావలన్‌ యాప్‌ను డౌన్‌లోడు చేసుకోవడం మంచిదని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు కంట్రోల్‌ రూమును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 80 శాతం మంది కుటుంబ సభ్యుల వల్లే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు కుమారి, న్యాయవాది ఆదిలక్ష్మి తదితరులు ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని