logo

పార్కు పనులు పూర్తి

స్థానికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న షెనాయ్‌నగర్‌ తిరువికా పార్కు త్వరలోనే ప్రారంభం కానుంది.

Published : 05 Feb 2023 00:58 IST

సిద్ధమైన పార్కు

వడపళని, న్యూస్‌టుడే: స్థానికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న షెనాయ్‌నగర్‌ తిరువికా పార్కు త్వరలోనే ప్రారంభం కానుంది. పదేళ్ల క్రితం ఈ పార్కును భూగర్భంలో మెట్రో స్టేషను నిర్మాణం కోసం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పార్కుకు కావలసిన అన్ని సదుపాయాలు పూర్తయ్యాయి. ఉదయం, సాయం వేళలో వ్యాహ్యాళికి వచ్చే వారికోసం ప్రత్యేక దారి, స్కేటింగు,  బ్యాడ్మింటన్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌ కోర్టు, క్రికెట్టులో శిక్షణ పొందేందుకు ప్రత్యేకంగా నెట్‌, ఔట్‌డోర్‌ జిమ్‌, చిన్నారులు అడుకునేందుకు స్థలం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, యోగా కేంద్రం వంటివి అందుబాటులోకి రానున్నాయి. 8.8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్కును 2011లో స్టేషను నిర్మాణం కోసం మూసివేశారు. నెల రోజుల్లోనే ప్రారంభించే అవకాశాలున్నాయని సీఎంఆర్‌ఎల్‌ అధికారులు పేర్కొన్నారు. పార్కులో చిన్నాచితక పనులు జరుగుతున్నాయని త్వరలోనే పూర్తవుతాయన్నారు.  స్టేషను నిర్మాణం కోసం 328 చెట్లను నరికి వేశారు. ఆరేళ్ల అనంతరం మెట్రో స్టేషను ప్రారంభమైనప్పటికీ పార్కు పునఃప్రారంభం కాకపోవడంతో స్థానికులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. నూతన వసతులతో పార్కును తీర్చిదిద్దినప్పటికీ చెట్లు లేని వెలితి బాగా కనిపిస్తోందని  షెనాయ్‌నగర్‌ వాసి కె.మోహన్‌ అన్నారు. పార్కు కింద ఉన్న భూగర్భ మెట్రో స్టేషనులో ప్రయాణికులకు కావలసిన సదుపాయాలు, మొదటి అంతస్తులో 1,200 వాహనాలు పార్కు చేసుకునే సదుపాయం ఉంది. రెండో అంతస్తులో అల్పాహార కేంద్రం, రీటైల్‌ దుకాణాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని