logo

దర్శకనటుడు టీపీ గజేంద్రన్‌ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, హాస్య నటుడు టీపీ గజేంద్రన్‌ ఆదివారం కన్నుమూశారు. కె.బాలచందర్‌, విసు, రామ నారాయణన్‌ వంటి ప్రముఖ దర్శకుల వద్ద 60కి పైగా సినిమాలకు సహాయకుడిగా పని చేశారు.

Published : 06 Feb 2023 00:49 IST

టీపీ గజేంద్రన్‌ (పాత చిత్రం)

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ప్రముఖ దర్శకుడు, హాస్య నటుడు టీపీ గజేంద్రన్‌ ఆదివారం కన్నుమూశారు. కె.బాలచందర్‌, విసు, రామ నారాయణన్‌ వంటి ప్రముఖ దర్శకుల వద్ద 60కి పైగా సినిమాలకు సహాయకుడిగా పని చేశారు. అలాగే ‘‘ఎంగ ఊరు కావల్‌కారన్‌’’, ‘‘మిడిల్‌ క్లాస్‌ మాదవన్‌’’, ‘‘బడ్జెట్‌ పద్మనాభన్‌’’, ‘‘వీడు మనైవి మక్కల్‌’’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హాస్య, గుణచిత్ర నటుడిగా కూడా తన ప్రత్యేకత చాటుకున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నివాళి అర్పించారు.

ప్రముఖుల సంతాపం

చెన్నై, న్యూస్‌టుడే: టీపీ గజేంద్రన్‌ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంతాపం తెలిపారు. తన కళాశాల సహచరుడైన ఆయన మృతివార్త ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. సినీరంగానికి ఉత్తమ సేవలు అందించారని తెలిపారు. 2021 సెప్టెంబరులో అనాగ్యానికి గురైన ఆయన్ను నేరుగా పరామర్శించానని గుర్తు చేసుకున్నారు. సమాచారశాఖ మంత్రి స్వామినాథన్‌ తన సంతాప ప్రటకనలో..  పలు విజయవంతమైన చిత్రాలకు టీపీ గజేంద్రన్‌ దర్శకత్వం వహించారని తెలిపారు. నటించి అభిమానుల మదిలో స్థానం పొందారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, సినీరంగ మిత్రులకు సానుభూతి తెలిపారు.

* టీపీ గజేంద్రన్‌ నటించిన సినిమాల్లో హాస్యం ద్వారా ప్రేక్షకులను ఆయన నవ్వించారని, ఆలోచించేలా చేశారని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని సంతాపం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని