logo

స్కేటింగ్‌లో దూసుకెళ్తున్న విద్యార్థిని

చదువు ఒక్కటే ఒకరి అభివృద్ధికి సరిపోదు. దానితోపాటు అదనంగా ప్రతిభ ఉండాలి. అందులోనూ క్రీడా ప్రతిభ చాలా ముఖ్యమైనది.

Published : 06 Feb 2023 00:49 IST

జాతీయ స్థాయిలో రికార్డు

స్కేటింగ్‌ చేస్తున్న రబియా సకియా

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చదువు ఒక్కటే ఒకరి అభివృద్ధికి సరిపోదు. దానితోపాటు అదనంగా ప్రతిభ ఉండాలి. అందులోనూ క్రీడా ప్రతిభ చాలా ముఖ్యమైనది. చెన్నైకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని రబియా సకియా కూడా ఇలాంటి ఆలోచనతోనే వ్యక్తిగత స్కేటింగ్‌ క్రీడలో పలు విజయాలు సాధిస్తోంది. 44 కి.మీ. దూరాన్ని గంట 46 నిమిషాల్లో దాటి ప్రపంచ రికార్డు సృష్టించింది. జాతీయ స్థాయిలో సత్తా చాటింది. తన విజయ విశేషాల గురించి విద్యార్థిని మాటల్లోనే.... ‘‘మెరినా సముద్రతీరానికి వెళ్లినప్పుడు అక్కడ కొందరు పిల్లలు స్కేటింగ్‌ శిక్షణ తీసుకోవడాన్ని చూశాను. అప్పుడే స్కేటింగ్‌ చేయాలని ఆశపడ్డాను. ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు శిక్షణకు పంపారు. వారి సహకారంగానే అంతర్జాతీయ స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించగలిగాను. ఆరేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. గెలుపు కోసం కోచ్‌ సతీష్‌రాజ సహకారం అందించారు. ఇప్పటివరకు 40కు పైగా పోటీల్లో పాల్గొన్నాను. 25 బంగారు పతకాలు గెలుచుకున్నాను. జాతీయ స్థాయిలో రెండు బంగారు, రాష్ట్ర స్థాయిలో ఐదు, జిల్లా స్థాయిలో 18 పసిడి పతకాలు వచ్చాయి. ఏదైనా కొత్తగా సాధించాలని ఆశపడ్డాను. దీన్ని అర్థం చేసుకున్న స్కేటింగ్‌ అకాడమీ అవకాశాలు ఇచ్చింది. స్కేటింగ్‌ ద్వారా ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో దాటి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించా. ఆరునెలలుగా సిద్ధమయ్యాను. ప్రారంభంలో 44 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్‌ చేస్తూ గంట 45 నిమిషాల్లోపు విరామం లేకుండా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ రికార్డు సృష్టించడానికి చాలానే కష్టపడ్డాను. 12 వంతెనలు దాటుకొని వెళ్లడం కఠినంగా సాగింది. చివరి వంతెనను దాటేసమయానికి చాలా అలసిపోయాను. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాను. అందుకే ఈ రికార్డుని సాధించగలిగాను. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పోటీలు ప్రారంభమయ్యాయి. వాటి కోసం సిద్ధమవుతున్నాను. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి రాష్ట్రానికి మరింత పేరు తెచ్చిపెట్టాలనేదే నా లక్ష్యం.’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని