logo

నెలాఖరులోగా అందుబాటులోకి ‘టీనగర్‌ స్కైవాక్‌’

టీనగర్‌ వాసులు, స్థానికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘టీనగర్‌ స్కైవాక్‌’ (ఆకాశ దారి నడక) ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Published : 06 Feb 2023 00:49 IST

నిర్మాణం పూర్తి చేసుకున్న స్కైవాక్‌

వడపళని, న్యూస్‌టుడే: టీనగర్‌ వాసులు, స్థానికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘టీనగర్‌ స్కైవాక్‌’ (ఆకాశ దారి నడక) ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రూ.23 కోట్లతో చేపట్టిన సై్ౖకవాక్‌ దాదాపు ఏడాది కాలంగా ప్రారంభానికి వాయిదా పడుతూ వస్తోంది. లిఫ్టు ఏర్పాటు వంటి పనులు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని నగర కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజినీరు ఎస్‌.రాజేంద్రన్‌ తెలిపారు. దివ్యాంగులకు రెండు చక్రాల కుర్చీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, వారు కూడా లిఫ్టు, లేదా స్కైవాక్‌ మీదుగా వెళ్లే వీలుంటుందని పేర్కొన్నారు. పాదచారుల సాయంతో వంతెనకు పసుపు రంగు  వేశారు. స్కైవాక్‌తో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి. రోజుకు 30 వేల మంది మాంబలం స్టేషన్‌కు, పలు ప్రాంతాల నుంచి వేలాది మంది దుకాణాలకు రాకపోకలు సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. 600 మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పుతో నిర్మాణం జరిగిన స్కైవాక్‌ అందరికీ ఉపయోగకరంగా ఉండనుంది. ప్రస్తుతం పనులు 95 శాతం వరకు పూర్తయ్యాయి. పనులను  డిప్యూటీ మేయరు మహేష్‌ కుమార్‌ తరచూ పరిశీలిస్తూ త్వరగా పూర్తిచేయాలని ఆదేశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు