logo

కంప్యూటర్‌ అధ్యాపకులకు వెసులుబాటుకు వినతి

వడపళని, ప్యారీస్‌, న్యూస్‌టుడే: కంప్యూటర్‌ సబ్జెక్టు బోధించేందుకు నిబంధనల్లో సడలింపులు చేయాలని రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలలు ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌’ (ఏఐసీటీఈ)ని అభ్యర్థించాయి.

Published : 07 Feb 2023 01:33 IST

వడపళని, ప్యారీస్‌, న్యూస్‌టుడే: కంప్యూటర్‌ సబ్జెక్టు బోధించేందుకు నిబంధనల్లో సడలింపులు చేయాలని రాష్ట్రంలోని ఇంజినీరింగు కళాశాలలు ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌’ (ఏఐసీటీఈ)ని అభ్యర్థించాయి. ‘ఈఈఈ’, ‘ఈసీఈ’ బ్రాంచిల వారికి బోధన అందిస్తున్న వారికే కంప్యూటర్‌ సబ్జెక్టు కూడా నేర్పించేందుకు అనుమతించాలని కోరాయి. కంప్యూటర్‌ సైన్సు, సంబంధిత కోర్సుల్లో యూజీ, పీజీ ఉన్న వారే ‘సీఎస్‌ఈ’ బ్రాంచి చదువుతున్న ఇంజినీరింగు విద్యార్థులకు తరగతులు తీసుకునేందుకు వీలుందని ఏఐసీటీఈ నిబంధనలో ఉంది. దీనిపై పలువురు విద్యా నిపుణులు ఏమంటున్నారంటే...గత ఏడాది సగం మంది మేరకు విద్యార్థులు సీఎస్‌ఈ, ఐటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డాటా సైన్సు కోర్సులను ఎంపిక చేసుకున్నారు. కొన్నేళ్లుగా బీఈ, బీటెక్‌ కోర్సులకు డిమాండు బాగా ఉండటంతో కొద్ది మాత్రమే ఎంఈ, ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలపై ఆసక్తి చూపించారు. కళాశాలలు కూడా ఎక్కువయ్యాయని, కంప్యూటర్‌ సంబంధిత కోర్సుల్లో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువైందని, బోధకుల సంఖ్య 20 నుంచి 30శాతం వరకు తక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈఈఈ, ఈసీఈ సబ్జెక్టుల్లో బోధించే అధ్యాపకులనే కంప్యూటర్‌ సంబంధిత కోర్సులు నేర్పించేందుకు అనుమతించాలని ఏఐసీటీఈకి ప్రతిపాదనలు పంపామని కన్సార్టియం ఆఫ్‌ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రొఫెషనల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల డిప్యూటీ కార్యదర్శి ఆర్‌ఎం కిశోర్‌ పేర్కొన్నారు. కంప్యూటర్‌ సైన్సు ప్రవేశపెట్టిన సమయంలో ఈఈఈ, ఈసీఈ అధ్యాపకులే బోధించే వారని కూడా గుర్తు చేశారు. కేసీజీ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రిన్సిపల్‌ పి.దైవ సుందరి మాట్లాడుతూ ఇతర విభాగాల అధ్యాపకులే కంప్యూటర్‌ సబ్జెక్టులో ప్రోగ్రామింగ్‌, ఏఐ, డాటా సైన్సు, గణితం, స్టాటిస్టిక్స్‌ సంబంధించిన అంశాలను బోధించగలరన్నారు. నైపుణ్యానికి సంబంధించిన పలు ఆన్‌లైన్‌ కోర్సుల్లో కూడా అధ్యాపకులు బోధించగలరని సుందరి చెప్పారు. కంప్యూటర్‌ సైన్సు అధ్యాపకులకు వేతనాలు కూడా పెరగలేదని, అది అమలైతే ఇతర సంస్థలనుంచి ఎక్కువమందిని తీసుకోగలమని రాజలక్ష్మీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వైస్‌ ఛైర్మన్‌ అభయ్‌ మేఘనాథన్‌ అన్నారు. కొన్ని కళాశాలలు ఆ రంగంలో నిపుణులైన వారిని వారాంతపు రోజుల్లో తరగతులు నిర్వహించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. ఎస్‌ఆర్‌ఎం వల్లియమ్మాళ్‌ ఇంజినీరింగు కళాశాల డైరెక్టర్‌ బి.చిదంబరరాజన్‌ మాట్లాడుతూ విద్యార్థి-అధ్యాపకుల నిష్పత్తిలో సడలింపులు చేస్తే బాగుంటుందనేది కొందరు ఆచార్యులు ఆలోచనగా ఉందన్నారు. అటానమస్‌ కళాశాలల్లో అధ్యాపకుల నిష్పత్తి 1:15, అనుబంధ కళాశాలల్లో అయితే 1:20గా ఉంది. దీన్ని ఏఐసీటీఐ 1:25 సడలింపులు చేస్తే అధ్యాపకుల కొరతను తీర్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సీఎస్‌ఈ బ్రాంచితో చదువుతున్న వారికి తరగతులు నిర్వహించేందుకు ఎంఈ, ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్సు చదవాల్సిందిగా కొన్ని డీమ్డ్‌ వర్సిటీలు తమ అధ్యాపకులకు విన్నవించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు