logo

ఐఐటీతో ఇస్రో ఒప్పందం

ఏఆర్‌, వీఆర్‌, ఎంఆర్‌ల విధానంలో ఐఐటీఎం శిక్షణను అభివృద్ధి చేయనుంది.

Published : 07 Feb 2023 01:33 IST

ఒప్పంద పత్రాలతో ఉమామహేశ్వరన్‌, ఐఐటీ ఆచార్యులు మణివణ్ణన్‌

వడపళని, న్యూస్‌టుడే: ఏఆర్‌, వీఆర్‌, ఎంఆర్‌ల విధానంలో ఐఐటీఎం శిక్షణను అభివృద్ధి చేయనుంది. నూతనంగా స్థాపించిన ‘ఎక్స్‌పీరియెన్షియల్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సెంటర్‌’ (ఈటీఐసీ)లో పరిశోధనను అభివృద్ధి చేసేందుకు ఆధునిక సాంకేతికతను ఇస్రో వినియోగించనుంది. ‘ఇండియన్‌ హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ ప్రోగ్రాం’లో భాగంగా ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. ఐఐటీ అప్లైడ్‌ మెకానిక్స్‌ విభాగ ఆచార్యులు మణివణ్ణన్‌ మాట్లాడుతూ ‘డిజైన్‌ సైకిల్‌ను తగ్గించడం, రోదసీ వాతావరణాన్ని ప్రేరేపించడంలో హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌లోని అంశాలలో విలువను చేర్చగలిగే సామర్థ్యం ఏఆర్‌ టెక్నాలజీకి ఉందని అన్నారు. రోదసీ కార్యక్రమాలకు అకాడమీతో అనుసంధానం ఉంటుందని, ఐఐటీతో కలిసి పని చేయడం ఆనందకరమని ఇస్రో హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.ఉమామహేశ్వరన్‌ పేర్కొన్నారు. హ్యూమన్‌ ఫిజియోలజీ, రోదసీ వ్యవస్థలను మోడలింగ్‌ చేయడం, మద్దతునిచ్చే కార్యకలాపాలు, డిజైన్‌ ఆర్కిటెక్చర్‌ను ఊహించడం, అనుకూలీకరించడం వంటి వాటికి ఒప్పందం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని