logo

నదుల పరిరక్షణకు అవగాహన ర్యాలీ

ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపంలోని హొగెనేకల్‌ పర్యాటక ప్రాంతంలో ప్లాస్టిక్‌ వస్తువులను నదిలో విసురుతున్న కారణంగా కాలుష్యం ఏర్పడుతోంది.

Published : 07 Feb 2023 01:33 IST

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ధర్మపురి జిల్లా పెన్నాగరం సమీపంలోని హొగెనేకల్‌ పర్యాటక ప్రాంతంలో ప్లాస్టిక్‌ వస్తువులను నదిలో విసురుతున్న కారణంగా కాలుష్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ధర్మపురి ప్రభుత్వ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కిళ్ళివళవన్‌ సూచన మేరకు ఎన్‌సీసీ అధికారి నేతృత్వంలో హొగెనేకల్‌కు  ర్యాలీగా వెళ్లారు. అక్కడ ‘నదులను కాపాడుదాం’ అంటూ హొగినేకల్‌ మొసళ్ల ఫాం నుంచి మెయిన్‌ జలపాతం వరకు కావేరి నది అంచుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, నీటి సీసాలు, చెత్తను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న పెన్నారం డీఎస్పీ ఇమయవర్మన్‌ విద్యార్థినులను ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని