logo

విలువలు బోధించిన ‘వళ్లలార్‌’

నాటక కావలర్‌ చమ్మల్‌ ఆర్‌ఎస్‌ మనోహర్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ బృందం ఆదివారం రాత్రి మైలాపూరులోని రసిక రంజనిసభ మెయిన్‌ హాలులో ప్రదర్శించిన ‘వళ్లలార్‌’ నాటకం మానవాళికి అవసరమైన విలువలు బోధించింది.

Published : 07 Feb 2023 01:33 IST

నాటకంలోని ఓ సన్నివేశం

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: నాటక కావలర్‌ చమ్మల్‌ ఆర్‌ఎస్‌ మనోహర్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ బృందం ఆదివారం రాత్రి మైలాపూరులోని రసిక రంజనిసభ మెయిన్‌ హాలులో ప్రదర్శించిన ‘వళ్లలార్‌’ నాటకం మానవాళికి అవసరమైన విలువలు బోధించింది. కార్తీక్‌ ఫైనార్ట్స్‌ ఆధ్వర్యంలో ‘తై పూసం’ పర్వదినం సందర్భంగా ఈ నాటక తొలి ప్రదర్శన ఏర్పాటైంది. 19వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక కవిగా, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా, అన్నింటినీ మించి ఆకలితో అలమటించే పేదలకు అన్నదానం చేయడం ఎంతో పుణ్య కార్యమని బోధించిన ‘వళ్లలార్‌’ జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఆధారంగా చేసుకుని నాటక రచయిత కలైమామణి డాక్టర్‌ కేపీ అరివానందం రసవత్తరంగా నాటకాన్ని రచించారు. ప్రముఖ సినీనటుడు ఆర్‌ఎస్‌ మనోహర్‌ మేనల్లుడు ఎస్‌.శివప్రసాద్‌ వళ్లలార్‌గా ప్రధాన పాత్రను, ఈయన కుమార్తె ఎస్‌.శృతి సుబ్రహ్మణ్యస్వామిగా నటించడమేగాక దర్శకత్వ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టారు. గృహప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చడమేగాక శ్రావ్యంగా నేపథ్య గానం అందించారు. ఆర్‌ఎస్‌ మనోహర్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ రంగాలంకరణ, మనోకాంతి ప్రసరణ, పుణ్యకోటి బృందం ఆహార్యం ప్రదర్శనను మరింత ఆకర్షణీయంగా మలిచింది. దాదాపు 15 మంది నటీనటులు వీరిలో కొందరు రెండు మూడు పాత్రలను పోషించి నాటక విజయానికి పునాది వేశారు. వడలూరులో ప్రస్తుతం జరుగుతున్న ట్లే వేదికపై సప్తరంగుల ఇంద్రధనస్సును ప్రదర్శించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. వళ్లలార్‌ 200 జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహిస్తున్నందున నాటక ప్రదర్శనకు నిర్వాహకులు ఉచిత ప్రవేశం కల్పించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని