logo

చోదకుడిపై సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది దాడి

ప్రభుత్వ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తీరుపై ప్రయాణికులు, స్థానికులు మండిపడ్డారు.ఈ ఘటన కృష్ణగిరిలో చోటుచేసుకుంది.

Updated : 07 Feb 2023 05:48 IST

ప్రయాణికుల నిరసన

వాహనాన్ని ముట్టడించి ఆందోళన నిర్వహిస్తున్న ప్రయాణికులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తీరుపై ప్రయాణికులు, స్థానికులు మండిపడ్డారు.ఈ ఘటన కృష్ణగిరిలో చోటుచేసుకుంది. వేలూర్‌ జిల్లా నుంచి మిలిటరీ సామాగ్రితో సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టరు ప్రతాప్‌ నేతృత్వంలో సోమవారం బెంగుళూరుకు బయలుదేరారు. కృష్ణగిరి నుంచి హోసూర్‌కు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఆర్మీ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసినట్లు తెలుస్తుంది. దీంతో డ్రైవర్‌కు, సైనికులకు మద్య వాగ్వాదం జరిగింది. దీంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది బస్సు డ్రైవరు తమిళరసుపై దాడిచేశారు. దీంతో అతను ఆర్మీ వాహనానికి అడ్డుగా బస్సును నిలిపేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు, ప్రజలు, బస్సు డ్రైవరును క్షమించమని అడగాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. దీంతో ప్రజలకు, సైనికులకు మద్య వాగ్వాదం ఏర్పడడంతో వారు తుపాకీతో ప్రజలను బెదిరించారు. సమాచారం అందిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చర్చించారు. సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టరు ప్రతాప్‌ క్షమాపణ చెప్పడంతో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని