logo

Teacher: 12 ఏళ్లుగా సెలవు తీసుకోని ఉపాధ్యాయుడు

12 ఏళ్లుగా సెలవు తీసుకోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. అరియలూరు జిల్లా జయంకొండం వద్ద ఉన్న కారైక్కురిచ్చి గ్రామంలో ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాల ఉంది.

Updated : 08 Feb 2023 11:55 IST

తరగతి గదిలో ఉపాధ్యాయుడు కలైయరసన్‌

ప్యారిస్‌, న్యూస్‌టుడే: 12 ఏళ్లుగా సెలవు తీసుకోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. అరియలూరు జిల్లా జయంకొండం వద్ద ఉన్న కారైక్కురిచ్చి గ్రామంలో ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో సింతామణి గ్రామానికి చెందిన కలైయరసన్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొదట కాట్టుమన్నార్‌గుడి, తర్వాత సిలాల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇప్పడు కారైక్కురిచ్చి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. 2014 నుంచి సెలవు తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.... ఉదయం 9 గంటలకు పాఠశాలకు వస్తానని, విద్యార్థులకు తరగతి ప్రారంభం అవడానికే ముందే, వారికి ఏదో ఒక పాఠం బోధించేవాడినని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రన్‌ మాట్లాడుతూ.. అందరికీ కలైయరసన్‌ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో ప్రభుత్వం తరఫున పాఠశాలకు వచ్చే సంక్షేమ సాయం విద్యార్థులకు అందిస్తారని చెప్పారు. ఈ పాఠశాలలో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఇందుకు ఇక్కడున్న ఉపాధ్యాయులు ఉత్తమ విధానంలో విద్యను బోధించడమే కారణం అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని