logo

ఆమె వయస్సు 123 ఏళ్లట.. పథకాలేవీ రావట్లేదు!

ఆధార్‌కార్డులో తప్పుగా నమోదైన వయస్సు ఆమెకు ప్రభుత్వ పథకాలు రాకుండా చేస్తున్నాయి. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఈ పొరపాటుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..

Updated : 28 Feb 2023 20:46 IST

ఆధార్‌కార్డును చూపుతున్న కవిత

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ఆధార్‌కార్డులో తన వయస్సు 123 ఏళ్లని ఉండడంతో ప్రభుత్వ పథకాలకు దాన్ని ఉపయోగించలేకపోతున్నానని ఓ బాధితురాలు వాపోయారు. ఈ మేరకు ఆమె తిరుచ్చి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. తిరుచ్చి జిల్లా తాయనూర్‌కు చెందిన కవిత 1982లో జన్మించారు. ఆధార్‌కార్డును తీసుకున్నప్పుడు  1900వ ఏడాదిగా అచ్చు వేసి ఇచ్చారు. దీంతో ఆమె ప్రభుత్వ పథకాలేవీ పొందలేని పరిస్థితి ఏర్పడింది. నాలుగేళ్లుగా పుట్టిన సంవత్సరాన్ని మార్చాలని కోరుతున్నా నిరాకరిస్తున్నారని తిరుచ్చి కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు