సంగం చరిత్ర.. కీలడిలో పదిలం!
దేశ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంతగా శివగంగై జిల్లా కీలడిలో పురాతన వస్తువులు బయటపడుతున్నారు. కొన్నేళ్లుగా ఇలా బయటపడ్డ వస్తువులు సంగం కాలంనాటివని రాష్ట్ర పురావస్తుశాఖ తేల్చింది.
అందుబాటులోకి అధునాతన మ్యూజియం
ఈనాడు, చెన్నై
దేశ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంతగా శివగంగై జిల్లా కీలడిలో పురాతన వస్తువులు బయటపడుతున్నారు. కొన్నేళ్లుగా ఇలా బయటపడ్డ వస్తువులు సంగం కాలంనాటివని రాష్ట్ర పురావస్తుశాఖ తేల్చింది. వాటన్నింటిని ఒక్కచోటికి చేర్చి కీలడిలో మ్యూజియంగా మలిచింది రాష్ట్ర ప్రభుత్వం. వైగై నది ఒడ్డున నాగరికత విశేషాల్ని అందులో పొందుపరచడంతోపాటు నాగరికత గొప్పతనాన్ని తెలిసేలా ప్రదర్శనల్ని కూడా ఇస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు.'
కీలడి మ్యూజియం
వైగై నది ఒడ్డున చారిత్రక విశేషాలు ఇప్పుడు కీలడి మ్యూజియంలో అపురూపంగా కనిపిస్తున్నాయి. ఏకంగా 10వేల పురాతన వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇవన్నీ కూడా కీలడి, అగరం, మనలూరు పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడినవే. సంగం కాలంలో అధునాతన నాగరికత ఉందని, వాటిలో ప్రముఖంగా కనిపించే రంగాల్ని ఈ మ్యూజియంలో చూడొచ్చని అధికారులు చెబుతున్నారు. దీన్ని ప్రారంభించిన తర్వాత.. ఇందులోని విశేషాలు తెలుసుకుని ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా సెల్ఫీలు దిగడంతో ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
చూడచక్కటి ప్రదేశం
ఈ మ్యూజియం భవనాలు 31వేల చ.అడుగుల్లో విస్తరించి ఉన్నాయి. పూర్తిగా చెట్టినాడ ఆర్కిటెక్చర్ స్టైల్‌లో నిర్మాణాల్ని చేపట్టారు. దీని కోసం రూ.18.43కోట్లను ఖర్చుపెట్టారు. మ్యూజియంను మొత్తంగా ఆరు భాగాలుగా విభజించారు. వ్యవసాయం, నీటిపారుదల నిర్వాహణ, మదురై-కీలడి, సిరామిక్ పరిశ్రమలు, చేనేత అల్లికలు, సముద్ర వాణిజ్యంలుగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దొరికిన పురాతన వస్తువుల్ని ఆయా విభాగాల్లో ఏర్పాటుచేశారు. భవనం మధ్యలో చూడచక్కటి ఓ కొలనునూ నిర్మించారు.
ఎన్నో అద్భుతాలు
సంగం కాలంలోని నాగరికతలో చాలా విశేషాలున్నట్లు మ్యూజియంలోని వస్తువుల్ని బట్టి తెలుస్తోంది. పూర్వం వ్యవసాయంలో వినియోగించిన ఎద్దు అస్తిపంజరాల్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వాటి ఆధారంగా ఆ కాలంలో ఎద్దు 3డీ చిత్రాన్ని ఆవిష్కరించారు. అప్పటి జంతువుల్లో కుక్క ఎముకలు కూడా ఇక్కడున్నాయి. అందరినీ ఆశ్చర్చంలో ముంచెత్తేలా బంగారం పూతపూసిన పలు కుండలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి.
పూర్వం వినియోగించిన రాగి సూదులు, క్రీడా వస్తువులు ఇలా ఎన్నో ఆసక్తిగొలుపుతున్నాయి. పట్టణీకరణకు అద్దం పట్టేలా పలు వస్తువులున్నాయి. ఇటుకలు, కాలువల వ్యవస్థ, టెర్రకోట పైపులు, ట్యాంకులు,
రాత్రివేళ కాంతుల మధ్య కొలను
అలంకరణ వస్తువులైన బంగారు ఆభరణాలు, లాకెట్లు, పూసలు, దంతపు దువ్వెనలు ఇక్కడ చూడొచ్చు. తవ్వకాల్లో దొరికిన వస్తువుల్లో పలుచోట్ల వారు వాడిన పదాల్ని బట్టి ఆ రోజుల్లో చక్కగా చదువుకున్నవారూ ఉన్నట్లుగా స్పష్టత ఇస్తున్నారు. ఇందుకు ఆధారంగా ఉన్న నలుపు, ఎరుపు కుండలు ఉంచారు. వాణిజ్య సంబంధాల్ని బలం చేకూర్చే మరిన్ని వస్తువులూ ఇక్కడున్నాయి. గుజరాత్ నుంచి ముడి పదార్థాలు తెచ్చి ఇక్కడే వస్తువులు తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేసిన దాఖలాలు ఉన్నట్లు చెబుతున్నారు. వ్యాపారం చేయడం కోసం అప్పటి ప్రజలు గణితాన్ని నేర్చుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
తాకితే వివరాలు
పూర్వ వస్తువులతో పాటు పలు ప్రత్యేక అత్యాధునిక ఆకర్షణలూ ఇందులో ఉన్నాయి. ఓ సంస్థతో కలిసి వర్చువల్ రియాలిటీ ప్రదర్శన కూడా చేస్తున్నారు. సంగం కాలపు పలు ఆభరణాల్ని స్వయంగా ధరించినట్లు అనుభూతి పొందేలా ఎల్‌ఈడీ తెరల్ని అమర్చారు. ఆ కాలంలో కట్టడాలు, గదులు, ఇతర వస్తువుల్ని నేరుగా చూసిన అనుభూతి పొందేలా వీఆర్ సెట్లను తెచ్చారు. కీలడి విశేషాలు తెలుసుకునేందుకు ఓ టచ్‌స్క్రీన్‌నీ పెట్టారు. అందులోని అంశాల వారీగా టచ్ చేసినప్పుడు వాటి విశేషాలు కనిపిస్తాయి.
దొరికిన వస్తువుల్ని ఇలా పేర్చి..
మరింత శోధన
పురావస్తు శాస్త్రం మరిన్ని పరిశోధనలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కీలడికి సింధూ నాగరికతతో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పరిశోధిస్తున్నారు. దీన్ని బలపరిచేలా గ్రాఫిటీ కళ ఇక్కడ బయటపడినట్లుగా వెల్లడిస్తున్నారు. వీటిపై లోతుగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే రోజా ముత్తయ్య రీసెర్చి లైబ్రరీతో చేతులు కలిపారు. కీలడిలో దొరికిన ఓ పుర్రెపై కూడా పురావస్తుశాఖ అధ్యయనం చేస్తోంది. పలు రకాల డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేస్తున్నారు. దీన్నిబట్టి ఇక్కడి నాగరికతను, వారి ఆహార వ్యవహారాల్ని కూడా అంచనా వేయవచ్చని చూస్తున్నారు. ఒక్క కీలడిలో దొరికన పుర్రే కాకుండా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన 30మందికి చెందిన పూర్వ అస్తిపంజరాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇదంతా మదురై కామరాజ్ యూనివర్సిటీలోని ల్యాబొరేటరీలో జరుగుతోంది.
వాణిజ్య అవసరాలకోసం వైగై నదిలో వాడిన ఓడల నమూనా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
TDP: మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి.. గవర్నర్కు తెదేపా ఫిర్యాదు
-
Crime News
Mumbai Murder: దుర్వాసన వస్తుంటే.. స్ప్రేకొట్టి తలుపుతీశాడు: ముంబయి హత్యను గుర్తించారిలా..!
-
General News
Bopparaju: 37 డిమాండ్లు సాధించాం.. ఉద్యమం విరమిస్తున్నాం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్ ఓ టైం బాంబ్..!