logo

మెట్రో పనులకు సీఆర్‌డీఏ అనుమతి

మెట్రో రెండో దశలో మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్‌ వరకు జరగాల్సిన పనులకు ‘కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ అథారిటీ’ (సీఆర్‌జడ్‌ఏ) నుంచి ‘చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌’ (సీఎంఆర్‌ఎల్‌)కు అనుమతి లభించింది.

Published : 21 Mar 2023 01:10 IST

వడపళని, న్యూస్‌టుడే: మెట్రో రెండో దశలో మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్‌ వరకు జరగాల్సిన పనులకు ‘కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ అథారిటీ’ (సీఆర్‌జడ్‌ఏ) నుంచి ‘చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌’ (సీఎంఆర్‌ఎల్‌)కు అనుమతి లభించింది. రెండో దశలో జరుగుతున్న మార్గంలో మూడు పొడవైన మార్గాలున్నాయి. మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్‌ వరకు 45.8 కి.మీ, లైట్‌ హౌజ్‌ నుంచి పూనమల్లి వరకు 26.1 కి.మీ, మాధవరం నుంచి షోలింనగల్లూరు వరకు 47 కి.మీ నిర్మాణం జరగనుంది. మైలాపూరు స్టేషను మూడు ప్లాట్‌ఫారాలతో నిర్మాణం జరుగుతుంది. 3, 4 లైన్ల నుంచి ఇంటర్‌ ఛేంజ్‌ వసతి ఉంటుంది. నేల మట్టానికి 35 మీటర్ల లోపల నాలుగు దశలుగా ఉంటుంది. ఈ పనుల కోసం సీఆర్‌జడ్‌ఏ నుంచి అనుమతి లభించిందని సీఎంఆర్‌ఎల్‌ పేర్కొంది. మాధవరం నుంచి సిరుసేరి సిప్కాట్‌ వరకున్న మార్గంలో 20 స్టేషన్లు పైన, 30 భూగర్భ మార్గంలో రానున్నాయి. అదేవిధంగా మైలాపూరు (తిరుమయిలై), ఇందిరా నగర్‌, తరమణి, బకింగ్‌హాం కెనాల్‌, అడయార్‌ నదిలో జరగాల్సిన పనులకు కూడా అనుమతి కోసం సీఎంఆర్‌ఎల్‌ లేఖ రాసింది.

* వర్క్‌షాపు పనులు వేగవంతం

మాధవరం, పూనమల్లిలో జరుగుతున్న వర్క్‌షాపు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని సీఎంఆర్‌ఎల్‌ పేర్కొంది. మెట్రో రెండో దశ ప్రాజెక్టు పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ నిర్వహణ పనులు జరుగుతాయి.   2024 చివరికల్లా పనులు పూర్తయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. రైళ్ల నిర్వహణ కోయంబేడు వర్క్‌షాపులో జరుగుతోంది. వింకోనగర్‌లో 20 ఎకరాల స్థలంలో నిర్వహణ కోసం జరుగుతున్న వర్క్‌షాపు నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అక్కడ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని