logo

బాలికను బడిలో తిరిగి చేర్చిన డీఎస్పీ

పేదరికం కారణంగా చదువు ఆపేసి కూలి పనులకు వెళ్తున్న విద్యార్థినిని తిరిగి పాఠశాలలో చేర్చిన డీఎస్పీని పలువురు అభినందిస్తున్నారు.

Published : 24 Mar 2023 00:25 IST

మాయవన్‌తో తామరైకని

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పేదరికం కారణంగా చదువు ఆపేసి కూలి పనులకు వెళ్తున్న విద్యార్థినిని తిరిగి పాఠశాలలో చేర్చిన డీఎస్పీని పలువురు అభినందిస్తున్నారు. తత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని అళ్వాతిరునగర్‌కు చెందిన లోకనాథన్‌ కార్మికుడు. ఆయన భార్య మృతి తర్వాత కుమార్తె తామరైకని కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటివరకు నజరేత్‌లోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివిన ఆమె పరిస్థితి గురించి పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆమెను డీఎస్పీ మాయవన్‌ తిరిగి బడికి పంపారు. ఇప్పటికే కరుంగులం ప్రాంతానికి చెందిన విద్యార్థి టీదుకాణంలో పనిచేస్తున్న విషయం తెలిసి పాఠశాలకు పంపడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని