logo

కానిస్టేబుల్‌కు ప్రశంసలు

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌లో జనసంచారం ఎక్కువగా ఉన్న కలెక్టరు కార్యాలయం ప్రాంతంలో మానసిక దివ్యాంగురాలిని చూసి ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసు సరస్వతి తన సొంత డబ్బుతో చీర కొనిచ్చారు.

Published : 24 Mar 2023 00:25 IST

పోలీసును సత్కరిస్తున్న దృశ్యం

వేలచ్చేరి, న్యూస్‌టుడే: కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌లో జనసంచారం ఎక్కువగా ఉన్న కలెక్టరు కార్యాలయం ప్రాంతంలో మానసిక దివ్యాంగురాలిని చూసి ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసు సరస్వతి తన సొంత డబ్బుతో చీర కొనిచ్చారు. తరువాత ఆ మహిళను ఆటోలో తీసుకుని ప్రభుత్వ శరణాలయానికి తరలించి అక్కడ అప్పగించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హరికృష్ణప్రసాద్‌ గురువారం తన కార్యాలయానికి సరస్వతిని పిలిపించారు. ఆమెను ప్రశంసించడంతోపాటు మహిళా పోలీసు ఇన్‌స్పెక్టరు నుంచి బహుమతి అందజేసి సత్కరింపజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని