విధుల నుంచి తొలగించాలని సీఎస్‌కు లేఖ
‘తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్’ (టీఎన్‌ఈఆర్సీ)లో కొనసాగుతున్న ఎం.మనోహరన్‌ను విధుల నుంచి తొలగించాలని అరప్పూర్ ఇయక్కం కన్వీనరు జయరామ్ వెంకటేశన్ మంగళవారం ప్రధాన కార్యదర్శి వి.ఇరైయన్బుకు లేఖ రాశారు.
చెన్నై, న్యూస్‌టుడే
చెన్నై కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రెండో రోజైన మంగళవారం మేయర్ ప్రియ అధ్యక్షతన కొనసాగింది.
వడపళని : ‘తమిళనాడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్’ (టీఎన్‌ఈఆర్సీ)లో కొనసాగుతున్న ఎం.మనోహరన్‌ను విధుల నుంచి తొలగించాలని అరప్పూర్ ఇయక్కం కన్వీనరు జయరామ్ వెంకటేశన్ మంగళవారం ప్రధాన కార్యదర్శి వి.ఇరైయన్బుకు లేఖ రాశారు. టాన్‌జెడ్కో, సౌత్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు బొగ్గు దిగుమతిలో రూ. 908 కోట్లకు సంబంధించి అవినీతికి పాల్పడినట్టు ఫిబ్రవరి 27న అరప్పూర్ ఫిర్యాదు చేసింది. టాన్‌జెడ్కోలోని పలువురు అధికారుల్లో ఎం.మనోహరన్ పేరు కూడా ఉందని, మాజీ డీఎఫ్‌సీ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన టీఎన్‌ఈఆర్సీలో టారిఫ్ డైరెక్టరుగా కొనసాగుతున్నారన్నారు. ఎఫ్‌ఐఆర్ పరిశీలనలో ఉన్న సమయంలో ఆయన టెండర్ కమిటీలో ఒకరుగా ఉన్నారు. సౌత్ ఇండియా సంస్థతో కలిసి రూ. 908 కోట్ల నష్టం వచ్చినట్టు చూపించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మనోహరన్ అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోందని, ఆయన్ను టీఎన్‌ఈఆర్సీ విధుల నుంచి తొలగించి చర్యలు చేపట్టాలని లేఖలో వెంకటేశన్ విన్నవించారు. లేఖ కాపీని ఎనర్జీ విభాగ అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ మీనా, టీఎన్‌ఈఆర్సీ ఛైర్మన్‌కు పంపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime news: కోర్కె తీర్చమంటే నో చెప్పిందని.. గర్ల్‌ఫ్రెండ్‌పై దారుణం
-
Politics News
Sattenapalli: కోడెల కుటుంబానికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు: నక్కా ఆనందబాబు
-
Sports News
WTC Final: ఆ సిరీస్ కంటే.. మాకిదే గ్రాండ్ ఫైనల్: ఆసీస్ టాప్ స్పిన్నర్ నాథన్ లైయన్
-
India News
Karnataka CM: ‘ఐదు గ్యారంటీల’కు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్.. ఈ ఏడాదే అమలు!