logo

ఏఎస్పీని అరెస్టు చేయాలని డిమాండ్‌

విచారణ ఖైదీల దంతాలు పీకి అతి క్రూరంగా శిక్షించిన ఏఎస్పీని వెంటనే అరెస్టు చేయాలని నేతాజీ సుభాష్‌ సేనా సంఘం కోరింది.

Updated : 29 Mar 2023 05:55 IST

చెన్నై, న్యూస్‌టుడే

క్షయవ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న ఓమందూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

ఆవడి, న్యూస్‌టుడే: విచారణ ఖైదీల దంతాలు పీకి అతి క్రూరంగా శిక్షించిన ఏఎస్పీని వెంటనే అరెస్టు చేయాలని నేతాజీ సుభాష్‌ సేనా సంఘం కోరింది. సోమవారం రాత్రి బాధితుడు లక్ష్మీ శంకర్‌ పోలీసుల భద్రత నడుమ దర్యాప్తునకు హాజరయ్యారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వచ్చిన కమిటీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. బాధితుల తరపున సంఘ అధ్యక్షుడు, న్యాయవాది మహారాజన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. బాధితులు 14 మంది అమాయకులని చెప్పారు. ఏఎస్పీని వెయిటింగ్‌ లిస్టుకు బదిలీ చేశారని, కానీ అరెస్టు చేయాలన్నారు. పోలీసు శాఖ వారు బాధితులు సాక్ష్యం చెప్పకుండా బెదిరిస్తున్నారని వెల్లడించారు. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నామని పేర్కొన్నారు. సబ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలోని దర్యాప్తు కమిటీపై తమకు నమ్మకం లేదన్నారు. వచ్చే శనివారం పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని