ప్రజాపనులశాఖ ఇంజినీర్లకు అభినందన
గతేడాది ప్రజాపనులశాఖ 23 పథకాలను అమలు చేసిన ఇంజినీర్లను మంత్రి ఏవీ వేలు అభినందించారు.
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి ఏవీ వేలు
సైదాపేట, న్యూస్‌టుడే: గతేడాది ప్రజాపనులశాఖ 23 పథకాలను అమలు చేసిన ఇంజినీర్లను మంత్రి ఏవీ వేలు అభినందించారు. ప్రజాపనులశాఖ పథకాల పనులు, ప్రకటనల గురించి మంత్రి ఏవీ వేలు సోమవారం అధికారులతో చర్చించారు. అసెంబ్లీలో గతేడాది ప్రకటించిన 23 ప్రకటనలు అమలు చేసినందుకు ఇంజినీర్లను ప్రశంసించారు. రాష్ట్రంలో వివిధ నిర్మాణాల పనుల గురించి మాట్లాడారు. ప్రస్తుతం శంకుస్థాపన చేసిన న్యాయస్థాన భవనాల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని, టీఎన్‌పీఎస్సీ ద్వారా నియమితులైన నూతన సహాయ ఇంజినీర్లకు తగిన క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. శాఖ ప్రధాన కార్యదర్శి మణివాసన్, ప్రధాన ఇంజినీరు విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana: మళ్లీ అలాంటి స్టార్ హీరోలనే చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు: రానా
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. పిచ్‌పై తగ్గిన పచ్చిక.. వైరల్‌గా మారిన దినేశ్ కార్తిక్ ఫొటోలు!
-
Sports News
wtc final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు రెండు పిచ్‌లు సిద్ధం.. ఎందుకంటే..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. సిగ్నల్ వైఫల్యం వల్ల కాకపోవచ్చు..!
-
Crime News
Sattenapalle: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత అనుమానంతో..
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన.. కేంద్రమంత్రి అర్ధరాత్రి ట్వీట్