logo

తల్లి లేకున్నా సజావుగా వివాహం

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌ కీలపెరువిలై ప్రాంతానికి చెందిన షణ్ముగవేల్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలో పనిచేసి విశ్రాంత పొందారు.

Published : 29 Mar 2023 00:25 IST

సాయపడిన బంధువులు, అధికారులు

వధువు పొన్‌ ప్రతీషా మెడలో తాళికడుతున్న వరుడు, తల్లి శాంతి (పాతచిత్రం)

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్‌ కీలపెరువిలై ప్రాంతానికి చెందిన షణ్ముగవేల్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీలో పనిచేసి విశ్రాంత పొందారు. వీరి భార్య శాంతి (53). వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్దకుమార్తె పొన్‌ ప్రతీషా ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఎల్లువిలైకు చెందిన శివరాజన్‌తో సోమవారం వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆదివారం షణ్ముగవేల్‌ ఇంటికి బంధువులు విచ్చేశారు. వారికి ఆహారం సిద్ధం చేస్తుండగా విద్యుత్తు షాక్‌తో వధువు తల్లి శాంతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇదిలా ఉండగా నిర్ణయించిన రోజునే వివాహం చేయాలని బంధువులు నిర్ణయించారు. కానీ శాంతి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరగలేదు. దీంతో విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ సిఫారసు చేయడంతో పోస్ట్‌మార్టం నిర్వహించి రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తిచేశారు. అనంతరం సోమవారం ఆసారిపల్లం ప్రాంతంలోని కళ్యాణమండపంలో పొన్‌ ప్రతీషాకు వివాహం జరిపించారు. వివాహం ఆగిపోకుండా సహకరించిన పోలీసులు, జిల్లా కలెక్టర్‌కు వధువు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు