logo

నీట్‌ అభ్యర్థుల వివరాల లీకుపై ఫిర్యాదు

నీట్‌ రాసే విద్యార్థుల వివరాలు లీకైన వ్యవహారంలో తగిన చర్యలు చేపట్టాలని పోలీసు కమిషనరు కార్యాలయంలో కాంగ్రెస్‌ తరఫున ఫిర్యాదు చేశారు.

Updated : 30 Mar 2023 06:17 IST

విలేకరులతో మాట్లాడుతున్న మయూర జయకుమార్‌

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: నీట్‌ రాసే విద్యార్థుల వివరాలు లీకైన వ్యవహారంలో తగిన చర్యలు చేపట్టాలని పోలీసు కమిషనరు కార్యాలయంలో కాంగ్రెస్‌ తరఫున ఫిర్యాదు చేశారు. కొన్ని ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లు ఈ వివరాలు పొంది వ్యాపారం చేసుకోవడానికి యత్నిస్తున్నాయని సమాచారం. బాధ్యులైన అధికారులు, కోచింగ్‌ సెంటర్లపై తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి మయూర జయకుమార్‌ నేతృత్వంలో పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తల్లిదండ్రులను వారు వేధిస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని