logo

న్యాయవాదుల ఆందోళన

రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణంలోని కాంచీపురం రోడ్డులో ఉన్న న్యాయస్థానం ఎదుట అరక్కోణం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లోకాభిరామన్‌ నేతృత్వంలో ఆందోళన బుధవారం జరిగింది.

Updated : 30 Mar 2023 06:14 IST

సైదాపేట: బ్యాంకు ఉద్యోగులు..

అరక్కోణం, న్యూస్‌టుడే:రాణిపేట జిల్లా అరక్కోణం పట్టణంలోని కాంచీపురం రోడ్డులో ఉన్న న్యాయస్థానం ఎదుట అరక్కోణం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లోకాభిరామన్‌ నేతృత్వంలో ఆందోళన బుధవారం జరిగింది. న్యాయవాదుల సంఘం కార్యదర్శి జానకిరామన్‌, కోశాధికారి వినోద్‌, సీనియర్‌ న్యాయవాదులు కన్నయ్యన్‌, బాల తిరువెంకటం, తమిళ్‌ మారన్‌ తదితరులు పాల్గొని తమకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బ్యాంకు అధ్యక్షుడికి వ్యతిరేకంగా...

అరక్కోణంలో ఆందోళన చేస్తున్న న్యాయవాదులు

సైదాపేట, న్యూస్‌టుడే: పదోన్నతి, బదిలీలకు లంచం అడుగుతున్న కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడి తీరుకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళన జరిగింది. చెన్నై బ్రాడ్వేలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట చెన్నై కేంద్ర సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు తమిళరసు నేతృత్వంలో జరిగిన ఆందోళనలో అనేక మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ సిబ్బంది...

విల్లివాక్కం: అంగన్‌వాడీ సిబ్బంది..

విల్లివాక్కం, న్యూస్‌టుడే: వేసవి దృష్ట్యా అంగన్‌వాడీ సిబ్బందికి నెలరోజులు సెలవులు ఇవ్వాలని కోరుతూ ధర్మపురి జిల్లా నత్తం బాలల అభివృద్ధి పథక కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ సిబ్బంది సంఘం తరఫున బుధవారం ఆందోళన చేపట్టారు. 10 ఏళ్లుగా పని చేస్తున్న సహాయకులకు ఎలాంటి నిబంధనలు లేకుండా పదోన్నతి కల్పించాలని కోరారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. సంఘ నత్తం నియోజకవర్గ కార్యదర్శి షణ్ముగవల్లి నేతృత్వం వహించారు.

పళ్ళిపట్టు, న్యూస్‌టుడే: తమ కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సిబ్బంది బుధవారం పళ్ళిపట్టులో ఆందోళన చేశారు. ప్రతినిధుల సంఘం యూనియన్‌ కార్యదర్శి మంజుల, అధ్యక్షురాలు చంద్ర తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో వృద్ధుడు..

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ కలెక్టరేట్‌లో ఓ వృద్ధుడు ఆందోళన చేశాడు. అరియూర్‌కు చెందిన సూర్యనారాయణన్‌ (62) బుధవారం ఉదయం వేలూర్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చారు. నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. తన స్థలాన్ని ప్రభుత్వ అధికారులు ఆక్రమించి గ్రంథాలయం నిర్మిస్తున్నారని, పరిహారం ఇవ్వాలని కోరారు. తర్వాత కలెక్టరేట్‌ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని