logo

రాష్ట్ర పర్యాటకశాఖకు కేంద్ర పురస్కారం

కన్యాకుమారి బీచ్‌ అభివృద్ధి పనులు చక్కగా నిర్వహించిన తమిళనాడు పర్యాటకశాఖకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది.

Published : 31 Mar 2023 02:04 IST

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి నుంచి పురస్కారం అందుకుంటున్న చంద్రమోహన్‌

సైదాపేట : కన్యాకుమారి బీచ్‌ అభివృద్ధి పనులు చక్కగా నిర్వహించిన తమిళనాడు పర్యాటకశాఖకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. దిల్లీలోని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తరఫున ఇటీవల ఇంటిగ్రేషన్‌, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యంపై జాతీయస్థాయి వర్క్‌షాప్‌ జరిగింది. ఈ సందర్భంగా శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ‘స్వదేశీ దర్శన్‌’ పథకం కింద కన్యాకుమారి బీచ్‌ అభివృద్ధి పనులు చక్కగా నిర్వహించినందుకుగాను తమిళనాడు పర్యాటకశాఖను అభినందించారు. రాష్ట్ర పర్యాటకం, సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్‌కు పురస్కారం అందజేశారు. ఈ పథకం కింద తమిళనాడులో చెన్నై మెరీనా, బెసెంట్‌ నగర్‌, మామల్లపురం, రామేశ్వరం కులశేఖరపట్నం బీచ్‌లు, కన్యాకుమారి జిల్లాలో కన్యాకుమారి బీచ్‌, త్రివేణి సంగమం, తెర్కురుచ్చి, మణక్కుడి బీచ్‌లు ఎంపికయ్యాయి. ఇందుకుగాను రూ.73.13 కోట్ల నిధులు కేటాయించారు.

అభివృద్ధి పనులు జరిగిన బీచ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు