logo

ఘనంగా నవమి వేడుకలు

ఆంధ్రా సాంఘిక, సాంస్కృతిక సమితి (ఆస్కా)లో శ్రీరామనవమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇందుకు ఆస్కా ప్రాంగణం వేదికైంది.

Published : 31 Mar 2023 02:04 IST

కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి, జేకేరెడ్డి తదితరులు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఆంధ్రా సాంఘిక, సాంస్కృతిక సమితి (ఆస్కా)లో శ్రీరామనవమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఇందుకు ఆస్కా ప్రాంగణం వేదికైంది. తెలుగు సంప్రదాయరీతిలో సీతారామ కల్యాణం, ఇతర పూజలు నిర్వహించారు. రవికుమార్‌ దంపతులు, అనిల్‌కుమార్‌రెడ్డి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డి, ఉపాధ్యక్షుడు రవీంద్రన్‌, సాంస్కృతిక విభాగ కార్యదర్శి ఎస్‌.వాసురావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని