logo

పుస్తకాల ఆవిష్కరణ

ప్రభుత్వం తరఫున రూపొందించిన పుస్తకాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థ తరఫున ‘ఊరగ తొళిల్‌ మునైవుగళుక్కు పుదియ పాదై’, ‘వరుమైయిలిరుందు వళతై నొక్కి’ పుస్తకాలు రూపొందించారు.

Published : 31 Mar 2023 02:04 IST

రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థ పుస్తకాలు ఆవిష్కరిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ప్రభుత్వం తరఫున రూపొందించిన పుస్తకాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థ తరఫున ‘ఊరగ తొళిల్‌ మునైవుగళుక్కు పుదియ పాదై’, ‘వరుమైయిలిరుందు వళతై నొక్కి’ పుస్తకాలు రూపొందించారు. సచివాలయంలో గురువారం వాటిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వెంట మంత్రి ఉదయనిధి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి అముద, శాఖ సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్‌, రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థ ఎండీ దివ్యదర్శిని ఉన్నారు. మున్సిపల్‌ పరిపాలన, తాగునీటి సరఫరాశాఖ తరఫున రూపొందించిన ‘అరసిన్‌ సాధనైగళ్‌ 2021-2023’ పుస్తకాన్నీ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వెంట శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, అదనపు ప్రధాన కార్యదర్శి శివ్‌దాస్‌ మీనా ఉన్నారు.

మున్సిపల్‌ పరిపాలన, తాగునీటి సరఫరాలశాఖ పుస్తకాన్ని..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని