విద్యార్థినులకు వరం.. పుదుమైప్పెన్ పథకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పుదుమైప్పెన్’ పథకం విద్యార్థినుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
పథకాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ (పాతచిత్రం)
రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పుదుమైప్పెన్’ పథకం విద్యార్థినుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న ఉన్నత ఆశయంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 1989లో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అనే పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టారు. అలాగే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేశారు. 1990లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి అతివలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు నాంది పలికారు. ఆ కోవలో ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలను మరింత పెంచేందుకు దోహదపడ్డారు. విద్యార్థినులు చదువుకు స్వస్తి చెప్పడాన్ని నివారించేందుకు, ఉన్నత విద్య కొనసాగించడానికి ప్రోత్సాహించేందుకు ‘పుదుమైప్పెన్’ పథకాన్ని తిరువళ్ళూరు సమీప పట్టాభిరాంలో ఫిబ్రవరి 8న ప్రారంభించారు. పాఠశాల చదువు పూర్తిచేసి కళాశాలల్లో చేరే ప్రతి విద్యార్థినికి నెలకు రూ.వెయ్యి చొప్పున బ్యాంకు ఖాతాలో వేయడమే పథక ఉద్దేశం. ఈ పథకానికి సాంఘిక సంక్షేమశాఖ ద్వారా నెలకు రూ.4.78 కోట్లను కేటాయిస్తున్నారు. మంత్రి నాజర్, కలెక్టరు ఆల్ఫిజాన్‌వర్గీస్ తిరువళ్ళూరు జిల్లాలో ఈ పథకం అమలుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
ఓ విద్యార్థినికి సాయం అందజేస్తున్న మంత్రి నాజర్
చదువు ఖర్చులు తీరుతున్నాయి
పొన్నేరి సమీప రెడ్డిపాళ్యానికి చెందిన పవిత్ర పొన్నేరిలోని ప్రభుత్వ ఉలగనాథన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తొలి ఏడాది చదువుతోంది. తండ్రి శేఖర్ రైతు కూలి. చాలీచాలని ఆదాయంతో గడుపుతున్న తన కుటుంబానికి ఈ పథకం కింద ప్రతి నెల అందిస్తున్న రూ.వెయ్యి ఎంతో ఉపయోగకరంగా ఉందని, చదువు ఖర్చులు తీరుతున్నాయని పవిత్ర అంటోంది.
పవిత్ర, విద్యార్థిని
సీఎంకు కృతజ్ఞతలు
తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో కామర్స్ తొలి ఏడాది చదువుతున్న మహాలక్ష్మి తండ్రి వీరాంజి రైతు కూలీ. పేదరికంలో మగ్గుతున్న తనకు నెలకు రూ.వెయ్యి అందిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌కు రుణపడి ఉన్నట్లు మహాలక్ష్మి పేర్కొన్నారు.
మహాలక్ష్మి, విద్యార్థిని
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు