విజేతలకు అభినందన
సైబర్ క్రైం విభాగం ఆధ్వర్యంలో సెయింట్ జోసఫ్ ఇంజినీరింగ్ కళాశాలతో కలిసి తమిళనాడు పోలీసుశాఖ ‘హ్యాకథాన్ 2023’ కార్యక్రమం మంగళ, బుధవారాల్లో నిర్వహించింది.
నగదు చెక్కు అందిస్తున్న డీజీపీ శైలేంద్రబాబు
వడపళని, న్యూస్‌టుడే: సైబర్ క్రైం విభాగం ఆధ్వర్యంలో సెయింట్ జోసఫ్ ఇంజినీరింగ్ కళాశాలతో కలిసి తమిళనాడు పోలీసుశాఖ ‘హ్యాకథాన్ 2023’ కార్యక్రమం మంగళ, బుధవారాల్లో నిర్వహించింది. 347 బృందాలకు గాను 60 బృందాలను ఎంపిక చేశారు. ఇందులో 16 బృందాలు చివరి దశకు ఎంపికయ్యాయి. హ్యాకథాన్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేదుకు పోటీలు నిర్వహించారు. విజేతల వివరాలు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. అన్నా వర్సిటీ ఎంఐటీ క్యాంపస్ ప్రాగ్‌టాగ్ బృందం ‘సోషల్ మీడియా వీడియో అనలిటిక్స్’ అంశంపై పాల్గొని మొదటి బహుమతి కింద రూ.70 వేలు నగదు గెలుచుకుంది. శ్రీ కృష్ణా ఇంజినీరింగ్ కళాశాల ఏ2జడ్ బృందం ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌లో నకిలీ నెంబరుతో తిరిగే వాహనాలను గుర్తించడంలో రెండో బహుమతి కింద రూ.50 వేలు స్వీకరించింది. శివ్ నాడార్ వర్సిటీ 1 బృందం నకిలీ నెంబర్ల వాహనాలు గుర్తించడంలో మూడో బహుమతిగా రూ.30 వేలు గెలుచుకుంది. విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీపీ శైలేంద్రబాబు బహుమతుల ప్రదానం చేశారు. సైబర్ విభాగ ఏడీజీపీ సంజయ్ కుమార్, ఎస్పీ కె.స్టాలిన్ తదితరులు హాజరయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Ts-top-news News
రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు