logo

లైంగిక వేధింపుల ఆరోపణలపై రహస్య విచారణ

లైంగిక వేధింపుల ఫిర్యాదుల గురించి జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు కళాక్షేత్రంలో రహస్యంగా విచారణ జరపడంతో ఉద్రిక్తత నెలకొంది.

Published : 31 Mar 2023 02:04 IST

విద్యార్థినుల ఆందోళన

ప్లకార్డులతో ర్యాలీగా వెళ్తున్న విద్యార్థినులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: లైంగిక వేధింపుల ఫిర్యాదుల గురించి జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు కళాక్షేత్రంలో రహస్యంగా విచారణ జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. అడయారు కళాక్షేత్రంలో ప్రొఫెసరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు విద్యార్థినులు సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకున్నారు. విషయం తెలుసుకున్న జాతీయ మహిళా కమిషన్‌.. రాష్ట్ర డీజీపీ విచారించాలని నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో కళాక్షేత్రానికి చెందిన విద్యార్థిని తన పేరుని కావాలనే ఉపయోగించి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారని, ఈ విషయమై చర్యలు చేపట్టాలని పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో జాతీయ మహిళా కమిషన్‌ డీజీపీకి పంపిన నోటీసుని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో అడయారు కళాక్షేత్రంలో గురువారం 3 గంటల పాటు జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖశర్మ రహస్యంగా విచారణ జరిపారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల వద్ద విచారణ జరిపినట్లు తెలుస్తోంది. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూని కూడా తీసుకెళ్లకుండా కమిషన్‌ అధ్యక్షురాలు విచారణ జరపడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంటు ప్రొఫెసరుని సస్పెండు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థినులు గురువారం ఆందోళన చేపట్టారు. కళాక్షేత్రం ఫౌండేషన్‌ డైరెక్టరు రేవతి రామచంద్రన్‌ విద్యార్థినులతో చర్చించినా ఆందోళన విరమించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని