logo

కోయంబత్తూరు చేరుకున్న ‘వందేభారత్‌’

వందే భారత్‌ రైలు కోయంబత్తూరుకు చేరుకుంది. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి చెన్నై-కోయంబత్తూరు మధ్య వందేభారత్‌ రైలు సేవలను ప్రధాని ప్రారంభించనున్నారు.

Published : 31 Mar 2023 02:04 IST

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: వందే భారత్‌ రైలు కోయంబత్తూరుకు చేరుకుంది. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి చెన్నై-కోయంబత్తూరు మధ్య వందేభారత్‌ రైలు సేవలను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందుకు ట్రయల్‌రన్‌ గురువారం నిర్వహించారు. ఉదయం 5.40 గంటలకు చెన్నై నుంచి బయలుదేరిన రైలు 11.30 గంటలకు కోయంబత్తూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు కోయంబత్తూరు నుంచి చెన్నైకి బయలుదేరింది. ప్రధాని రైలు సేవలను ప్రారంభించిన తరువాత ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నైకి చేరనుంది. సేలం, ఈరోడు, తిరుప్పూరు రైల్వేస్టేషన్‌లలో మాత్రం ఆగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని