logo

ఆస్పత్రుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్‌ మళ్లీ ఆందోళనకు గురిచేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు.

Published : 31 Mar 2023 02:04 IST

మంత్రి మా.సుబ్రమణియన్‌

ప్రజలకు కొబ్బరిబొండాలు అందిస్తున్న మా.సుబ్రమణియన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్‌ మళ్లీ ఆందోళనకు గురిచేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై పళ్లిక్కారణైలో డీఎంకే తరఫున చలివేంద్రాన్ని గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బుధవారం దేశవ్యాప్తంగా 24 వేల కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు. దిల్లీ, కర్ణాటక, కేరళ, గుజరాత్‌ తదితర పలు రాష్ట్రాలలో రోజుకు 400 నుంచి 500 వరకు కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 వేల మందికి పరీక్షలు చేస్తే 112 మందికి మాత్రమే నిర్ధారణ అయిందన్నారు. జ్వర పరీక్షల శిబిరాలు నడుస్తూనే ఉన్నాయన్నారు. జనం గుమిగూడి ఉండే కార్యక్రమాల్లో మాస్కులు ధరించి, తరచూ చేతులు శుభ్రపరుచుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న ప్రకటన రెండ్రోజుల్లో విడదల చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు