logo

కక్షసాధింపు చర్యలకు భయపడం: ముకుల్‌ వాస్నిక్‌

భాజపా కక్షసాధింపు చర్యలకు కాంగ్రెస్‌ భయపడబోమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ తెలిపారు. నగరంలోని సత్యమూర్తి భవన్‌లో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు.

Published : 01 Apr 2023 05:33 IST

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముకుల్‌ వాస్నిక్‌

చెన్నై : భాజపా కక్షసాధింపు చర్యలకు కాంగ్రెస్‌ భయపడబోమని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ తెలిపారు. నగరంలోని సత్యమూర్తి భవన్‌లో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. అదానీ కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధమయ్యారని విమర్శించారు. అదానీ గురించి ప్రశ్నించడంతోనే రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏఐసీసీ అన్నిటికీ సిద్ధమన్నారు. అదానీ అక్రమాల గురించి లోక్‌సభలో రాహుల్‌ ప్రసంగించిన 9 రోజులకు ఆయనపై పరువునష్టం కేసుకు ప్రాణం పోశారని తెలిపారు. లోక్‌సభలో రాహుల్‌, రాజ్యసభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని తెలిపారు. ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ విచారణను కోరిన ప్రతిపక్షాలను భాజపా పట్టించుకోలేదని పేర్కొన్నారు. లండన్‌లో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. వెనుకబడిన సామాజిక వర్గాన్ని కించపరిచినట్టు కేసు పెట్టారని, కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లో రాహుల్‌ ఎంపీ పదవిపై వేటు వేశారని పేర్కొన్నారు. ఈ కక్షసాధింపు చర్యలను చూసి కాంగ్రెస్‌ భయపడబోదని తెలిపారు.  


ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌కు పరామర్శ

చెన్నై : అనారోగ్యంతో శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న ఈరోడు తూర్పు ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ను ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ముకుల్‌ వాస్నిక్‌ శుక్రవారం పరామర్శించారు. వెంట ఎంపీలు తిరునావుక్కరసర్‌, విజయ్‌ వసంత్‌, విష్ణు ప్రసాద్‌, ఎమ్మెల్యే రూబి మనోహరన్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని