logo

రైళ్ల శుభ్రతా ప్లాంటు ప్రారంభం

మెట్రో రైళ్లను శుభ్రం చేసేందుకు, రోలింగ్‌ స్టాక్‌ లిఫ్టు చేసేందుకు ‘మొబైల్‌ లిఫ్టింగ్‌ జాక్‌’ను వింకోనగర్‌ మెట్రో డిపోలో ‘ఆటోమేటిక్‌ ట్రైన్‌ వాష్‌ ప్లాంట్‌’ను ‘సీఎంఆర్‌ఎల్‌’ సిస్టమ్‌, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ రాజేష్‌ చతుర్వేది శనివారం ప్రారంభించారు.

Published : 01 Apr 2023 05:33 IST

ప్లాంటును ప్రారంభిస్తున్న రాజేష్‌ చతుర్వేది

వడపళని, న్యూస్‌టుడే: మెట్రో రైళ్లను శుభ్రం చేసేందుకు, రోలింగ్‌ స్టాక్‌ లిఫ్టు చేసేందుకు ‘మొబైల్‌ లిఫ్టింగ్‌ జాక్‌’ను వింకోనగర్‌ మెట్రో డిపోలో ‘ఆటోమేటిక్‌ ట్రైన్‌ వాష్‌ ప్లాంట్‌’ను ‘సీఎంఆర్‌ఎల్‌’ సిస్టమ్‌, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ రాజేష్‌ చతుర్వేది శనివారం ప్రారంభించారు. డిటర్జంట్‌ విధానంతో, హైప్రెషర్‌తో కూడిన వాటర్‌ జెట్‌, తిరిగే పెద్ద బ్రష్‌లతో రైళ్ల బోగీల ముందు, వెనుక శుభ్రం చేస్తుంది. ఆటోమేటిక్‌ సెన్సార్లతో పని చేస్తుంది. నాలుగు బోగీలను శుభ్రం చేయడానికి 2 వేల లీటర్ల నీటిని ప్లాంటులో వినియోగిస్తారు. దీని ద్వారా నిర్వహణ ఖర్చు తగ్గుతుందని,  రైళ్ల మన్నిక ఉంటుందని, ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణం చేసే వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు. జర్మనీలోని విల్కోమేటిక్‌ వాష్‌ సిస్టమ్స్‌ ఈ ప్లాంటును తయారు చేయగా, దిల్లీలోని స్వస్తిక్‌ ఓవర్సీస్‌ సంస్థ వింకోనగర్‌ డిపోకు సరఫరా చేసింది.

మొబైల్‌ లిఫ్టింగ్‌ జాక్‌

మొబైల్‌ లిఫ్టింగ్‌ జాక్‌తో రైలు కింది భాగంలో పరీక్షలకు వినియోగిస్తారు. అసెంబుల్డ్‌ కండిషన్‌లో ఉన్న రైళ్లను  వింకోనగర్‌ డిపోలో పైకి ఎత్తేందుకు ఈ యంత్రం పని చేస్తుంది. రెన్‌మాక్చ్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ  మొబైల్‌ లిఫ్టింగ్‌ జాక్‌ను వింకోనగర్‌ డిపోలో ఏర్పాటు చేసింది. సీఎంఆర్‌ఎల్‌ రోలింగ్‌ స్టాక్‌ జనరల్‌ మేనేజరు ఏఆర్‌ రాజేంద్రన్‌, ఏజీఎం ఎస్‌.సతీష్‌ ప్రభు ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని