logo

రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు

ప్రజలకు రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. తిరువళ్ళూరు జిల్లా విల్లివాక్కం యూనియన్‌ కొళ్లుమేడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిద్ధ వైద్య విభాగం ఏర్పాటు చేశారు.

Published : 01 Apr 2023 05:33 IST

మంత్రి మా సుబ్రమణియన్‌

విద్యార్థులకు మందులున్న పెట్టెలు అందజేస్తున్న మా సుబ్రమణియన్‌

ఆవడి, న్యూస్‌టుడే: ప్రజలకు రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. తిరువళ్ళూరు జిల్లా విల్లివాక్కం యూనియన్‌ కొళ్లుమేడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిద్ధ వైద్య విభాగం ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ ఆల్ఫిజాన్‌వర్గీస్‌ ఆధ్వర్యంలో మంత్రి విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం ‘ఇలంజి మండ్రం’ అనే సిద్ధ వైద్య పాఠశాల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోనే ఎక్కువ వైద్యశాలలు రాష్ట్రంలో ఉండటం గర్వంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు సిద్ధ వైద్య విభాగం తరఫున జ్ఞాపకశక్తిని పెంచే మాత్రలు, లేహ్యం, రక్తహీనత నియంత్రణ మాత్రలున్న పెట్టెలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శనం, హోమియోపతి విభాగ డైరెక్టర్‌ గణేష్‌, ఏడీ పార్తిబన్‌, సిద్ధ వైద్య అధికారి అయ్యాస్వామి తదిరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని