logo

పాత్రికేయుడి కుటుంబానికి సాయం

డీఎంకే అధికార పత్రిక మురసొలి ఉప సంపాదకుడు రాజా మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి రూ.5 లక్షల సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

Published : 01 Apr 2023 05:33 IST

బ్యాంకు చెక్కు అందిస్తున్న స్వామినాథన్‌

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే అధికార పత్రిక మురసొలి ఉప సంపాదకుడు రాజా మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి రూ.5 లక్షల సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం జనరల్‌ ఫండ్‌, పాత్రికేయుల కుటుంబ సహాయ నిధి పథకం కింద ఈ మొత్తానికి సంబంధించిన బ్యాంకు చెక్కును సచివాలయంలో సమాచారశాఖ మంత్రి స్వామినాథన్‌ అందజేశారు. ఈ సందర్భంగా సమాచార, ప్రజా సంబంధాలశాఖ సంచాలకులు మోహన్‌, పాత్రికేయుల సంక్షేమ బోర్డు అధికారేతర సభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు