logo

కౌన్సిలర్ల నిరసన

కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశానికి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నల్ల దుస్తులు ధరించి వచ్చి ఆందోళన చేపట్టారు. కోయంబత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోని విక్టోరియా హాల్‌లో మేయర్‌ కల్పన ఆనందకుమార్‌ నేతృత్వంలో 2023-24 ఏడాదికిగాను బడ్జెట్‌ సమావేశం శుక్రవారం జరిగింది.

Published : 01 Apr 2023 05:31 IST

రాహుల్‌ గాంధీ చిత్రపటంతో నిరసన తెలుపుతున్న దృశ్యం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశానికి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నల్ల దుస్తులు ధరించి వచ్చి ఆందోళన చేపట్టారు. కోయంబత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయంలోని విక్టోరియా హాల్‌లో మేయర్‌ కల్పన ఆనందకుమార్‌ నేతృత్వంలో 2023-24 ఏడాదికిగాను బడ్జెట్‌ సమావేశం శుక్రవారం జరిగింది. కార్పొరేషన్‌ కమిషనరు ప్రతాప్‌, డిప్యూటీ మేయర్‌ వెట్రిసెల్వన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బడ్జెట్‌ నివేదికను మేయర్‌ చదివి వినిపించారు. కార్పొరేషన్‌ ఆదాయం రూ.3,018.90 కోట్లు, వ్యయం రూ.3,029.07 కోట్లు, రెవెన్యూ లోటు రూ.10.17 కోట్లుగా తెలిపారు. ఈ సందర్బంగా రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష విధించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని