logo

రాష్ట్రంలో పది ఇంధన స్టేషన్లు

రాష్ట్రంలో పది చోట్ల ఇంధన స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన స్థలాల్లోనే స్టేషన్లు ఉంటాయని ఆ శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ అన్నారు.

Published : 01 Apr 2023 05:32 IST

వడపళని, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పది చోట్ల ఇంధన స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన స్థలాల్లోనే స్టేషన్లు ఉంటాయని ఆ శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ అన్నారు. చెన్నై నగరంలో మూడు, ఇతర ప్రాంతాల్లో ఏడు స్టేషన్‌లు అందుబాటులోకి రానున్నాయి. రిటైల్‌ పెట్రోల్‌, డీజిల్‌ బంకులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ బస్సులతో పాటు ఇతర పబ్లిక్‌ వాహనాలు కూడా ఇంధనాన్ని నింపుకోవచ్చు. చెన్నైతో పాటు తిరుచ్చి, దిండివనం, కుంభకోణం వంటి ప్రాంతాల్లో ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌),  హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు టెండర్లలో భాగం కానున్నాయి. నెలకు 5 నుంచి 10 లక్షల లీటర్ల వరకు రిటైల్‌ యూనిట్లలో అమ్మకాలు జరుగుతాయన్నారు. ప్రకటనల రూపంలో రవాణా సంస్థకు ఆదాయం పెంచే దిశగా దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని