logo

పులితోక పట్టుకున్న సెల్లూర్‌ రాజు

ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి సెల్లూర్‌ రాజు మాట్లాడుతూ... మదురైలో ఎలాంటి పరిశ్రమలు లేవన్నారు. అలాంటప్పుడు మెట్రోరైలు రావడంతో ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు.

Published : 01 Apr 2023 05:28 IST

ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి సెల్లూర్‌ రాజు మాట్లాడుతూ... మదురైలో ఎలాంటి పరిశ్రమలు లేవన్నారు. అలాంటప్పుడు మెట్రోరైలు రావడంతో ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. మదురై ప్రజలు ఆహా, ఓహో అని అభినందించేలా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఆ శాఖ మంత్రి చర్యలు చేపట్టాలని సూచించారు. దీనికి మంత్రి తంగం తెన్నరసు స్పందిస్తూ... సెల్లూర్‌ రాజును రాష్ట్ర ప్రజలు ఆహా, ఓహో అంటున్నారని తెలిపారు. ఇటీవల ఆయన ఓ పులి తోక పట్టుకున్న ఫొటో విడుదలైందని పేర్కొన్నారు. ఆయన విషయం తెలిసిన వ్యక్తన్నారు. పులి నోరు ఉన్న వైపు కాకుండా తోక ఉన్నవైపు పట్టుకున్నారని చెప్పడంతో సభ్యులు నవ్వేశారు. మదురైలో రూ.600 కోట్ల వ్యయంతో టైడల్‌ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. శాసనసభలో పాఠశాల విద్యాశాఖ ప్రకటనలను మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి, ఉన్నత విద్యాశాఖ ప్రకటనలను మంత్రి పొన్ముడి విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని