logo

రూ.600 కోట్లతో తిరుచ్చిలో ఐటీ పార్క్‌

తిరుచ్చిలో రూ.600 కోట్ల ఖర్చుతో ఐటీ పార్క్‌ ఏర్పాటు కానుందని మంత్రి కేఎన్‌ నెహ్రూ తెలిపారు. తిరుచ్చి జిల్లా ఎడమలై పట్టిపుదూర్‌ ప్రాంతంలో రూ.90కోట్ల ఖర్చుతో అన్ని వసతులతో కూడిన కార్పొరేషన్‌ మహోన్నత పాఠశాల నిర్మాణ పనులకు మున్సిపాలిటీ నిర్వహణశాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ గురువారం శంకుస్థాపన చేశారు.

Updated : 26 May 2023 04:53 IST

శంకుస్థాపన చేస్తున్న మంత్రి కేఎన్‌ నెహ్రూ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తిరుచ్చిలో రూ.600 కోట్ల ఖర్చుతో ఐటీ పార్క్‌ ఏర్పాటు కానుందని మంత్రి కేఎన్‌ నెహ్రూ తెలిపారు. తిరుచ్చి జిల్లా ఎడమలై పట్టిపుదూర్‌ ప్రాంతంలో రూ.90కోట్ల ఖర్చుతో అన్ని వసతులతో కూడిన కార్పొరేషన్‌ మహోన్నత పాఠశాల నిర్మాణ పనులకు మున్సిపాలిటీ నిర్వహణశాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కార్పొరేషన్‌ పాఠశాలను రూ.9.90కోట్ల ఖర్చుతో దిల్లీ మోడల్‌ బడిలా నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే జనవరిలోపు ప్రారంభం అవుతుందన్నారు. పళనిస్వామి అమెరికాకు ఆయన పాలనలో మంత్రులను తీసుకెళ్లాన్నారు. కానీ ఏ ఒప్పందాలూ చేసుకోలేదని గుర్తుచేశారు. తిరుచ్చి పంజపూర్‌ బస్టాండ్‌లో 500 బస్సులు నిలిపే వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటికి పక్కనే రూ.600 కోట్ల ఖర్చుతో ఐటీ పార్క్‌ రానుందన్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో పరిశ్రమల కోసం ఒప్పందం కుదుర్చుకొని రెండులక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. బుధవారం సింగపూర్‌లో ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లారన్నారు. వారిపై ఆరోపణలు చేయడం మానేసి ఇప్పటివరకు రాష్ట్రానికి అన్నాడీఎంకే ఏం చేసిందో తిరిగి చూసుకోవాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని